Janhvi Kapoor Sridevi : అందాల నటి శ్రీదేవి కుమార్తెగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో కూడా బిజీ కాబోతోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఈమధ్యే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలను గుర్తు చేసుకుని అక్కాచెల్లెళ్లు ఎమోషనల్ అయ్యారు. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓవైపు రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
శ్రీదేవి, ఖుషి ఒకేలా!
'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని ఖుషీ కపూర్ తెలిపింది. తన తల్లి, సోదరి ఖుషి ఒకేలా ఉంటారని జాన్వి తెలిపింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూసింది. ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఇప్పటికే శ్రీదేవి ఫొటోలు పోస్ట్ చేస్తూ గుర్తుతెచ్చుకుంటుంటారు.
శిఖర్ పహారియాతో డేటింగ్ నిజమా?
కాగా ఈ ఎపిసోడ్‌లో జాన్వి తన రూమర్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి మాట్లాడింది. శిఖర్ పహారియాతో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు, జాన్వీ కపూర్ శిఖర్ తన ఫ్యామిలీలో తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నారని సమాధానం చెప్పింది. శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని, తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వి చెప్పింది.
అందుకే నటులతో నో డేటింగ్!
తను నటులతో ఎందుకు డేటింగ్ చేయడానికి ఇష్టపడరో కూడా జాన్వి స్పష్టం చేసింది. యాక్టింగ్ కెరీర్లో పూర్తిగా నిమగ్నమై ఉండాలని, తనను ఇష్టపడే వ్యక్తి తనపట్ల శ్రద్ధ చూపడంతో పాటు, సమయం ఇవ్వాలని కోరుకుంటానని చెప్పింది. నటీనటుల విషయంలో అది కుదరదని, ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారని అలాంటి ఎమోషన్స్ తాను బ్యాలెన్స్ చేయలేనని తెలిపింది.
జాన్వీ కపూర్ 2018లో ధడక్ సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. అటు జాన్వి సోదరి ఖుషీ కపూర్ ఈ మధ్యే ద ఆర్చీస్ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">