Jailer Day 4 Collection : సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా మూడో రోజే వంద కోట్ల క్లబ్లో చేరగా.. తాజాగా నాలుగో రోజు దాదాపు రూ. 38 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా మొత్తం కలెక్షన్లు ఎంతంటే..
సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న జైలర్ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 146 కోట్లు వసూల్ చేసి.. ప్రస్తుతం రూ. 150 కోట్లకు చేరువలో ఉంది. మరోవైపు నాలుగు రోజుల నుంచి కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి.
జైలర్ సినిమా రోజువారీ కలెక్షన్లు...
- మొదటి రోజు రూ. 48.35 కోట్లు
- రెండో రోజు రూ. 25.75 కోట్లు
- మూడో రోజు రూ. 35 కోట్లు
- నాలుగో రోజు రూ. 38 కోట్లు.
కాగా జైలర్‌తో రజనీ చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. ఇదివరకు ఆయన నటించిన కబాలి, పేట, కాల సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. తాజాగా జైలర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం వల్ల.. థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇన్ని రోజులకు రజనీ రేంజ్‌కు తగ్గ బొమ్మ పడిందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా రానున్న రెండు రోజులు కలెక్షన్ల సునామీ కురవడం పక్కా అని సినీవర్గాల టాక్.
జైలర్ విషయానికొస్తే... డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను మెప్పించడంలో విజయవంతమయ్యారు. సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా అన్ని అంశాలను నెల్సన్ చక్కగా తెరకెక్కించారు. ఇక మూవీలో తండ్రీ - కుమారుల సెంటిమెంట్‌కు ఆడియెన్స్ పూర్తిగా కనెక్ట్ అయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన సీనియర్ నటి రమ్యకృష్ణను చూసి.. ఫ్యాన్స్ పాత రోజులు గుర్తుచేసుకున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఓ స్పెషల్ సాంగ్‌తో మెరిశారు.
మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్.. ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్ధ సన్ పిక్చర్స్ ఈ సినిమాకు రూపొందించింది.
-
Solid start for #Jailer in theatres. 💥The Tiger roaring worldwide 😎🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts… pic.twitter.com/7PSJUuL8jQ
— Sun Pictures (@sunpictures) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Solid start for #Jailer in theatres. 💥The Tiger roaring worldwide 😎🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts… pic.twitter.com/7PSJUuL8jQ
— Sun Pictures (@sunpictures) August 11, 2023Solid start for #Jailer in theatres. 💥The Tiger roaring worldwide 😎🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts… pic.twitter.com/7PSJUuL8jQ
— Sun Pictures (@sunpictures) August 11, 2023
Jailer and Bhola shankar : చిరుకు షాక్.. ఇకపై 'భోళాశంకర్' థియేటర్లలో రజనీ 'జైలర్'!