Jabardasth Avinash Baby : 'జబర్దస్త్' షోతో పాపులరై బిగ్బాస్తోనూ అలరించారు ప్రముఖ నటుడు ముక్కు అవినాశ్. ఆయన టీవీ షోల్లోనే కాకుండా ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ విషాదకరమైన విషయాన్ని పంచుకున్నారు. తమ బిడ్డని కోల్పోయామంటూ అభిమానులతో చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు.
2021 అవినాశ్ - అనూజలకు వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఇన్‌స్టా రీల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు పెడుతూ గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో తాము పేరెంట్స్ అవ్వనున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ విషయమై పలు ఈ జంట వీడియోస్ కూడా షేర్ చేస్తూ వచ్చారు. తాజాగా అనూజకు సీమంతం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బిడ్డ ఈ లోకాన్ని చూడలేకుండా పోయిందని అవినాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
" నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఓ విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురు చూశాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతోనే ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టొద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ మీ అనూజ అవినాశ్' అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు 'బీ స్ట్రాంగ్ బ్రో' అంటూ అవినాశ్‌ను ఓదార్చుతున్నారు.
Mukku Avinash: 'ముక్కు' అవినాష్ నిశ్చితార్థం- వధువు ఎవరంటే?