ETV Bharat / entertainment

సలార్​ డబుల్​ బొనాంజా.. ప్రభాస్​కు తమ్ముడిగా విజయ్​ దేవరకొండ! - ఖుషి సినిమా దర్శకుడు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురురచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్క్‌లైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్​లో ఆయన నటిస్తున్నారని తెలిసింది. ఆ సంగతులు..

vijay deverakonda
విజయ్ దేవరకొండ
author img

By

Published : Nov 28, 2022, 6:59 PM IST

'లైగర్‌'తో పరాజయం అందుకున్న హీరో విజయ్‌ దేవరకొండ.. ప్రస్తుతం 'ఖుషి' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న 'సలార్‌'లో విజయ్‌ దేవరకొండ భాగం కానున్నారంటూ పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు సోదరుడిగా విజయ్‌ కనిపించనున్నారని.. 'సలార్‌' క్లైమాక్స్‌లో విజయ్‌ని పరిచయం చేసి తర్వాత రానున్న 'సలార్‌-2'లో కీలకమైన రోల్‌లో ఆయన్ని చూపించనున్నారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

మరోవైపు, విజయ్‌ దేవరకొండ గత కొన్నిరోజుల నుంచి ఓ శీతల పానీయం యాడ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోన్న ఈ షూట్‌ నుంచి ఆయన ఫొటో ఒకటి బయటకువచ్చింది. అందులో ఆయన లుక్‌ చూస్తే.. 'సలార్‌'లో ప్రభాస్‌ని గుర్తు చేసేలా ఉంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు 'సలార్‌'లో విజయ్‌ నటిస్తోన్న మాట వాస్తవమేనని అనుకుంటున్నారు.

vijay deverakonda
విజయ్ దేవరకొండ

బాడీగార్డ్‌ బర్త్‌డే చేసిన విజయ్‌..! విజయ్‌ దేవరకొండ తన మంచి మనసు చాటుకున్నాడు. సినిమా ప్రమోషన్స్‌, ఈవెంట్స్‌, ఇతర పబ్లింగ్ మీటింగ్స్‌లో నిరంతరం తనని సంరక్షిస్తోన్న బాడీగార్డ్‌ పుట్టినరోజును విజయ్ సెలబ్రేట్‌ చేశాడు. కేక్‌ కోయించి విషెస్‌ తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి:'కొన్నిసార్లు తిరుగుబాటు అవ‌స‌రమే'.. 'RC 16' అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసిందోచ్​..

'ప్రకృతి' లవ్​ను కన్ఫార్మ్​ చేసిన స్టార్ హీరో.. ప్రేమతో మనసు నిండిపోయిందంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.