Nora Fatehi Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో భారీ యాక్షన్స్ సీన్స్, టాకీపార్ట్ పూర్తి చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషలలో ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది ఈ సినిమా.
ఈ మూవీలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నటించబోతున్నారట. ఇప్పటికే నోరా.. టాలీవుడ్‌లో బాహుబలి, టెంపర్, ఊపిరి, లోఫర్ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.
మళ్లీ ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హారిహర వీరమల్లు'లో కీలక పాత్రను చేసే అవకాశమందని సమాచారం. త్వరలోనే చిత్రబృందం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇటీవలే పవన్ సెట్స్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను పోస్టు చేసింది చిత్రబృందం. నిపుణుల ఆధ్వర్యంలో బల్లెంతో పోరాట ఘట్టానికి సంబంధించిన సన్నివేశాల కోసం పవన్ శిక్షణ తీసుకున్నారు.
ఇవీ చదవండి: 'అమ్మ మరణం తర్వాత అతడి రాక.. చాలా ధైర్యాన్నిచ్చింది'