ETV Bharat / entertainment

ఇండిపెండెన్స్​ వీక్​లో కలెక్షన్లు పీక్స్​.. వెయ్యి కోట్ల పైనే మార్కెట్​.. 'జైలర్' వాటాయే రూ.500 కోట్లు! - independence week collections

Indian Box Office Collection Worldwide : ఇండిపెండెన్స్​ వీక్​లో ఆయా భాషల్లో స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకోవడం వల్ల.. ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఆ కలెక్షన్ల వివరాలు..

ఇండిపెండెన్స్​ వీక్​లో కలెక్షన్లు
ఇండిపెండెన్స్​ వీక్​లో కలెక్షన్లు
author img

By

Published : Aug 19, 2023, 8:44 PM IST

Indian Box Office Collection Worldwide : ఇండిపెండెన్స్​ వీక్​లో విడుదలైన భారతీయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రజనీకాంత్ 'జైలర్', సన్నీ దేఓల్ 'గదార్ 2', అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2' సినిమాలు థియేటర్లలో హౌస్​​ఫుల్​ షోస్​తో దూసుకుపోతోతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏయే సినిమా ఎంత వసూల్ చేసిందంటే..

Jailer Worldwide Collection : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్​లో అతి పెద్ద హిట్​గా నిలిచింది 'జైలర్'. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో.. ఈ సినిమా ఆగస్టు 10న విడుదలైంది. హిట్​ టాక్​ సొంతం చేసుకున్న జైలర్.. తొలిరోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో తమిళ్ స్టార్ కమల్​ హసన్ 'విక్రమ్' సినిమా కలెక్షన్లను.. 'జైలర్'​ ఆరు రోజుల్లోనే క్రాస్​ చేసి రికార్డు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో కలిపి.. రూ. 449.75 కోట్లు వసుల్ చేసింది.

Gadar 2 Worldwide Collection : దేశభక్తి తరహాలో తెరకెక్కిన చిత్రం 'గదర్ 2'. రెండు దశాబ్దాల కిందట రిలీజై సూపర్​ హిట్​గా నిలిచిన 'గదర్ - ఏక్ ప్రేమ్ కథా' సినిమాకు సీక్వెల్​గా రూపొందిందే 'గదర్ 2'. ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. మొదటి రోజే రూ. 40 కోట్ల కలెక్షన్స్​ రాబట్టి.. సత్తా చాటిందీ సినిమా. ఇక తర్వాత రోజుల్లోనూ సినిమాకు ఇదే తరహా కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గదర్ 2.. రూ. 305.13 కోట్లు రాబట్టింది.

OMG 2 Worldwide Collection : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ మై గాడ్ 2'. దర్శకుడు అమిత్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమాతో అక్షయ్.. చాలా రోజుల తర్వాత మళ్లీ సక్సెస్​ అందుకున్నారు. ఆగస్టు 11 నుంచి ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. కాగా ఈ సినిమా ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 130 కోట్ల వసుల్ చేసింది.

Bhola Shankar Worldwide Collection : : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్'.. ఆగస్టు 11న గ్రాండ్​గా రిలీజైంది. తమిళ 'వేదాళం' సినిమాకు రిమేక్​గా వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా ఇప్పటిదాకా రూ. 43.55 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

Jailer VS Vikram Collection : కమల్​ హాసన్​ 'విక్రమ్​' ఆల్​టైమ్​ రికార్డ్​ కలెక్షన్స్​ బ్రేక్​.. 'జైలర్' ఎన్ని వందల కోట్లు సాధించిందంటే?

Rajinikanth Jailer Collections : 'గదర్ 2'- 'జైలర్​'-'భోళా' కలెక్షన్స్​.. 6వ రోజు భోళాజీ ఒక్కరే అలా.. ఆ రికార్డ్ బ్రేక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.