Highest Paid Comedian In The World : సినిమా నటులు తమకున్న క్రేజ్ ఆధారంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తారు. సాధారణంగా హీరోలు అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకునే అవకాశముంది. హీరోయిన్లు కొంచెం తక్కువ పారితోషికం తీసుకుంటారు. అదే హాస్యనటుల విషయానికి వస్తే.. ఈ సంఖ్య ఇంకా తక్కువగనే ఉంటుంది. కానీ.. ఒక కమెడియన్ ఒక్క సినిమాకు మన హీరోలందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నారు.
భారతీయ సినిమా నటుల కంటే హాలీవుడ్ తారలు ఎక్కువ రెమ్యునరేషన్ పొందుతారనే విషయం అందరికీ తెలుసు. అయితే.. ప్రస్తుతం వస్తున్న ఇండియన్ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ వరల్డ్‌వైడ్‌గా పెరిగిపోవడంతో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ప్రభాస్, విజయ్ వంటి సూపర్ స్టార్లు ఈ అంతరాన్ని తగ్గించారు. ఆమిర్ ఖాన్ ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో సైతం కొనసాగాడు. అయినప్పటికీ.. ఈ విషయంలో హాలీవుడ్‌తో పోలిస్తే.. మన దేశ సినీరంగ నటుల పారితోషికం ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హాస్యనటుల్లో టాప్ ప్లేస్‌లో ఎవరున్నారో మీకు తెలుసా..? ఆయనే హాలీవుడ్ కమెడియన్ 'జిమ్ క్యారీ'.
వరల్డ్ నెంబర్ 1గా..!
2008లోనే ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హాస్య నటుల్లో తొలి స్థానంలో నిలిచారు జిమ్ క్యారీ. ఈయన రెండు దశాబ్దాలుగా ప్రపంచంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ పొందుతున్న హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. 1990ల్లో 'ది మాస్క్', 'లయర్ లయర్' లాంటి చిత్రాలు తీసి విజయం సాధించినప్పటి నుంచే మిలియన్ డాలర్లలో వసూలు చేయడం ప్రారంభించారు. క్యారీ 'Bruce Almighty' అనే చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 2008లో వచ్చిన 'Yes Man' అనే చిత్రానికి 35 మిలియన్ డాలర్లు(సుమారు రూ.285 కోట్లు) తీసుకున్నారు. కాగా, దీని విలువ అప్పట్లో రూ.150 కోట్లు. అంటే టాలీవుడ్ లెజెండ్స్ కంటే కూడా ఎక్కువే.
-
Happy Birthday Jim Carrey: Check his iconic comedy flicks
— ANI Digital (@ani_digital) January 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/1hQhUtIZ32#JimCarrey #comedian #Hollywood #birthday pic.twitter.com/rFc0tKH5Xa
">Happy Birthday Jim Carrey: Check his iconic comedy flicks
— ANI Digital (@ani_digital) January 17, 2023
Read @ANI Story | https://t.co/1hQhUtIZ32#JimCarrey #comedian #Hollywood #birthday pic.twitter.com/rFc0tKH5XaHappy Birthday Jim Carrey: Check his iconic comedy flicks
— ANI Digital (@ani_digital) January 17, 2023
Read @ANI Story | https://t.co/1hQhUtIZ32#JimCarrey #comedian #Hollywood #birthday pic.twitter.com/rFc0tKH5Xa
క్రేజ్ తగ్గినా.. తగ్గేదేలే..!
ప్రస్తుతం ఇతని స్టార్ డమ్ గణనీయంగా తగ్గిపోయినప్పటికీ.. జిమ్ క్యారీ ఒక్క చిత్రానికి 15-20 మిలియన్(రూ.130 నుంచి రూ.160 కోట్లు) డాలర్లు వసూలు చేస్తారు. ఇది భారతీయ నటుల వేతనాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. 2008లో ఇతను ఒక్క సినిమాకి 35 మిలియన్ డాలర్లు తీసుకునేవారు. అప్పట్లో ఇది విల్ స్మిత్, బ్రాడ్ పిట్ లాంటి దిగ్గజాలు ఒకే చిత్రానికి ఛార్జ్ చేసిన దానికంటే ఎక్కువ. విల్ స్మిత్ 2021లో వచ్చిన 'Emancipation' సినిమాకు అత్యధికంగా 30 మిలియన్(సుమారు రూ.248.17 కోట్లు) డాలర్లు తీసుకోగా.. బ్రాడ్ పిట్ అదే సంవత్సరం వచ్చిన 'Ocean's Eleven Back' చిత్రానికి అంతే మొత్తంలో వసూలు చేశారు.
మన నటుల సంగతేంటి?
మన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో తమిళ నటుడు తళపతి విజయ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం లియో కోసం ఏకంగా రూ.200 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక షారుక్, సల్మాన్, ప్రభాస్ లాంటి అగ్ర నటులు.. లాభాల వాటా ఆధారంగా ఎప్పుడో ఒకసారి ఒక్క సినిమాకు రూ.120 కోట్లు నుంచి రూ.150 కోట్ల మధ్య వసూలు చేస్తారు. ఆమిర్ ఖాన్, రజనీకాంత్ లాంటి వారు కూడా ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నారు.
Kushi Twitter Review : థియేటర్లలోకి సామ్- విజయ్ 'ఖుషి'.. సినిమా ఎలా ఉందంటే?
Anushka Shetty New Movie : పాన్ ఇండియా లెవెల్లో అనుష్క మూవీ.. 14 భాషల్లో రిలీజ్.. హీరో ఎవరంటే?