ETV Bharat / entertainment

విజయ్ 'వారిసు' కోసం పాట పాడిన స్టార్ హీరో - వారిసులో పాట పాడిన హీరో శింబు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'వారిసు'. ఈ చిత్రం కోసం ఓ స్టార్ హీరో పాట పాడారని తెలిసింది. ఇంతకీ ఆ కథనాయకుడు ఎవరంటే

Hero simbu sings a song for Vijay varisu
విజయ్ 'వారిసు' కోసం పాట పాడిన స్టార్ హీరో
author img

By

Published : Nov 25, 2022, 8:44 PM IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'వారిసు'. ఈ చిత్రం తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ చిత్రం కోసం శింబు ఓ పాట పాడారని కొన్ని ఆంగ్ల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ పాటను రెండురోజుల ముందే రికార్డు చేశారని టాక్‌.

గతంలో శింబు గొంతు కొన్ని సినిమాల్లోని పాటల్లో వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్‌ చిత్రం 'డబుల్‌ ఎక్స్ఎల్‌'లో ఓ పాట పాడిన ఈ సూపర్‌ హీరో విజయ్‌తో ఉన్న స్నేహాంతో వారసుడులో పాడరని అంటున్నారు. ఇక ఈ పాటను డిసెంబర్‌ రెండో వారంలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌చేస్తున్నారట. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను చెన్నైలో డిసెంబర్‌23న నిర్వహించే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ సినిమాలోని 'రంజిదమే' పాట విడుదలై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ పాటకు కోట్లలో వ్యూస్‌ వచ్చాయి. విజయ్‌, రష్మికల స్టెప్పులకు ఫిదా అయిన పలువురు వీరిలానే డ్యాన్స్‌ చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ట్రెండ్‌ సృష్టించారు.

ఇదీ చూడండి: ప్రభాస్​తో పెళ్లి.. ఎట్టకేలకు నిజం ఒప్పేసుకుందిగా కృతిసనన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.