ETV Bharat / entertainment

కొత్త మూవీ ప్రకటించిన విజయ్​ దేవరకొండ.. 'గీతా గోవిందం' సీక్వెల్! - గీతా గోవిందం 2 విజయ్​ దేవర కొండ

టాలీవుడ్​ యంగ్​ హీరో విజయ్​ దేవరకొండ తన తదుపరి సినిమాను ప్రకటించారు. తనకు 'గీతా గోవిందం'తో సూపర్​ హిట్​ ఇచ్చిన దర్శకుడు పరశురాంతో ఈ కొత్త సినిమా చేయబోతున్నారు. చిత్రాన్ని దిల్​రాజు నిర్మించనున్నారు.

geetha govindam 2
geetha govindam 2
author img

By

Published : Feb 5, 2023, 8:45 PM IST

Updated : Feb 5, 2023, 9:22 PM IST

'అర్జున్​ రెడ్డి' సినిమాతో విజయ్​ దేవరకొండ యంగ్​ సెన్సేషన్​ అయ్యారు. ఇప్పుడీ హీరో మళ్లీ స్పీడు పెంచుతున్నారు. ఈ ఏడాది వీలైనన్ని ఎక్కువ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లి.. వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతేడాది 'లైగర్' సినిమా కోసం మిగతా సినిమాలని వెయిటింగ్ లిస్టులో పెట్టారని సమాచారం. తాజాగా ఈ 'రౌడీ'​ హీరో మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

'అర్జున్​ రెడ్డి' తర్వాత అదే రేంజ్​లో విజయ్​కు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'గీతా గోవిందం'. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్​బ్యానర్​పై రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో విజయ్​, పరశురాం మరో సారి జట్టు కట్టబోతున్నారు. ఈ కొత్త సినిమాకు దిల్​రాజు నిర్మాతగా వ్యవరించబోతున్నారు. ఈ మేరకు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్​.. ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. కాగా, ఈ సినిమా.. విజయ్​ సూపర్​ హిట్​ మూవీ 'గీతా గోవిందం'కు సీక్వెల్​ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతేడాది పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ హీరోగా వచ్చిన చిత్రం 'లైగర్​'.. భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీసు వద్ద ఆశించినంతగా ఆడలేకపోయింది. ఆ సినిమా ఫలితంతో నిరాశపడ్డ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు మళ్లీ తన మార్కెట్​ను కాపాడుకునే విధంగా సినిమాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న 'ఖుషి' సినిమాకు ఓకే చెప్పారు. దర్శకుడు గౌతమ్​ తిన్ననూరితో మరో సినిమాను లైన్లోకి తీసుకువచ్చారు.

Last Updated : Feb 5, 2023, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.