ETV Bharat / entertainment

ఒకటి కాదు రెండు కాదు.. ఈ హీరో- డైరెక్టర్​ కాంబోలు నాలుగో సారి రిపీట్​! - గోపిచంద్​ మలినేని రవితేజ కాంబో

టాలీవుడ్​లో పలు హీరో-డైరెక్టర్ కాంబోలు బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో సెన్సేషన్​ సృష్టించాయి. అయితే ఆ కలయికలో ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే ముచ్చటగా మూడు బ్లాక్​ బస్టర్లు తెరకెక్కగా.. తాజాగా నాలుగో సినిమాకు శ్రీకారం చుట్టారు. వారెవరంటే ?

Upcoming Films which mark 4th Collaboration of Hero and Director

author img

By

Published : Jul 9, 2023, 7:41 PM IST

Hero Directors Combo : సినీ ఇండస్ట్రీలో ఎవరైనా డైరెక్టర్ ఓ స్టార్​తో సినిమా తీసి.. అది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే ఇక ఆ తర్వాత అటు ఆ హీరోతో పాటు డైరెక్టర్​ కూడా మరో ప్రాజెక్ట్​కు చేతులు కలిపేందుకు ఇంట్రెస్ట్​ చూపిస్తుంటారు. ప్రేక్షకులు కూడా ఇటువంటి క్రేజీ కాంబోలో మరో సినిమా పడితే బొమ్మ బ్లాక్​బస్టర్ అవ్వడం ఖాయం అంటూ అభిప్రాయపడుతుంటారు. అయితే అటువంటి కాంబో మరో సారి కలిసి పని చేయాలంటే దానికి తగ్గట్టు కథ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అభిమానులు సైతం వారిపై భారీ అంచనాలను పెట్టుకుంటారు కాబట్టి ఈ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక వేళ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోకపోతే ఇక అంతే సంగతులు.. అభిమానులు కూడా ఇక మరో సారి వారిపై నమ్మకం పెట్టుకోరు. కానీ ఫ్యాన్స్​ ఎక్స్​పెక్టేషన్స్​కు సరితూగేలా సినిమాలు చేస్తూ.. పలు కాంబోలు ఇండస్ట్రీలో సెన్సేషన్​ సృష్టించాయి. వాటిలో కొన్నేమో సీక్వెల్స్​ అయితే మరికొన్నేమో కొత్త ప్రాజెక్ట్స్​. అలా టాలీవుడ్​లో ఒక్క సారి రెండు సార్లు కాదు ఏకంగా నాలుగోసారి కలిసి వర్క్​ చేసేందుకు రెడీగా ఉన్న స్టార్స్ ఎవరంటే..

త్రివిక్రమ్​- అల్లు అర్జున్
Trivikram Allu Arjun Movies : ఇటీవలే తమ నాల్గవ ప్రాజెక్ట్​ గురించి​ ప్రకటించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​- అల్లు అర్జున్ కాంబో. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన 'జులాయి', 'సన్​ ఆఫ్​ సత్యమూర్తి', 'అల వైకుంఠ పురంలో' సినిమాలు ఆడియెన్స్​ను అలరించి బాక్సాఫీస్ వద్ద హిట్​ టాక్​ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ వీరి కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

సుకుమార్​- అల్లు అర్జున్​
Sukumar Allu Arjun Movies : అల్లు అర్జున్ కెరీర్​ను మలుపు తిప్పిన సినిమాల్లో 'ఆర్య -1' ఒకటి. లవ్​ ఎంటర్టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్​ రూపొందించారు. అప్పట్లో యూత్​ను ఈ సినిమా తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమాకు వచ్చిన 'ఆర్య -2' కూడా మంచి టాక్ అందుకుంది. ఇలా ఈ కాంబోలో రెండు క్లాస్​ సినిమాలు వచ్చాక.. సుక్కు ఓ మాస్టర్​ ప్లాన్​తో 'పుష్ప' సినిమాను తెరకెక్కించారు. అల్లు అర్జున్ లీడ్​ రోల్​లో వచ్చిన ఆ సినిమా టాలీవుడ్​లోనే కాదు పాన్ ఇండియా లెవెల్​లో ఆడియెన్స్​ను షేక్​ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో అల్లు అర్జున్​కి కూడా మాస్​ హీరోగా మంచి పేరు వచ్చింది. ఇక ఈ కాంబో 'పుష్ప 2' సినిమా కోసం మరోసారి కలిసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గోపిచంద్​ మలినేని- రవితేజ
Gopichand Malineni Ravi Teja Movies : టాలీవుడ్‌లో ట్రెండ్ సృష్టించిన మరో క్రేజీ కాంబో మాస్​ మహారాజా రవితేజ - దర్శకుడు గోపిచంద్‌ మలినేని. వీళ్లిద్దరూ ఇప్పటికే మూడు చిత్రాలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సూపర్​ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. వీరి కాంబోలో వచ్చిన 'డాన్​ శీను', 'బలుపు', 'క్రాక్'​ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినవే.

బోయాపాటి శీను- బాలకృష్ణ
Bala krishna Boyapati Movies : అటు మాస్​ నుంచి ఇటు క్లాస్ ఆడియెన్స్​లో బాలకృష్ణ - బోయపాటి కాంబోకు మంచి క్రేజ్​ ఉంది. ఈ కలయికలో వచ్చిన సినిమాలు థియేటర్లలో సంచలనాలు సృష్టించాయి. 'సింహా', 'లెజెండ్'​, 'అఖండ' సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుందన్న రూమర్స్​ సోషల్​ మీడియాలో హల్​ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.