Father Daughter Sentiment : తండ్రీ-కూతుళ్ల బంధం ఎంత గొప్పగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సెంటిమెంట్‌తో వచ్చే సినిమాలకు కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి అంతే ఆదరణ ఉంటుంది. టాలీవుడ్లో సహా పలు భాషల్లో ఈ తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ తరహాలో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం తెలుగులో మరోసారి తండ్రీ-కూతుళ్ల అనుబంధంతో సాగే పలు చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.
దసరా కానుకగా విడుదలవుతున్న 'భగవంత్ కేసరి', 'లియో' చిత్రాలు ఈ కేటగిరిలోనే రానున్నాయి. యాక్షన్ సినిమాలే అయినా.. కథలో మాత్రం తండ్రి-కూతుర్ల సెంటిమెంటే కీలకం అని టాక్ నడుస్తోంది. దళపతి విజయ్ నటించిన 'లియో'లో.. 'విక్రమ్' మించి యాక్షన్ ఉంటుందని లోకేశ్ కనగరాజ్ చెబుతున్నారు. కానీ, స్టోరీ మొత్తం తండ్రి-కూతుర్ల మధ్య ఉన్న సంబంధం మీదే ఉంటుందని సమాచారం.
మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి'లో శ్రీలీల.. బాలయ్యకు కూతురుగా నటించింది. ఇందులో విజ్జి పాప అనే క్యారెక్టర్లో కనిపించే శ్రీలీల.. బాలయ్యను చిచ్చా అంటూ ముద్దుగా పిలుస్తూ సినిమాలో సందడి చేయనుంది. తన బిడ్డకు కష్టం వస్తే.. ఎలా పోరాడాలి అనే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని తెలిసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక డిసెంబర్లో వస్తున్న 'హాయ్ నాన్న' సినిమా కూడా తండ్రి-కూతుర్ల సెంటిమెంట్‌తో వస్తుందని టైటిల్ చూడగానే తెలిసిపోతుంది. తాజాగా విడుదలైన టీజర్లో కూడా ప్రధానంగా ఆ ఎమోషనే చూపించారు. ఆ తర్వాత సంక్రాతికి సిద్ధం అవుతున్నవెంకటేశ్ మూవీ 'సైంధవ్'లో కూడా ఇలాంటి ఎమోషనే ఉంటుందని సమాచారం. ఆ ఎలిమెంట్ ఈ సినిమాకు కీలకం అని టాక్ వినిపిస్తోంది. తండ్రి-కూతుర్ల అనుబంధంతో వస్తున్న ఈ సినిమాలు ఏ విధంగా అలరిస్తాయో వేచి చూడాలి మరీ. అయితే కొన్ని సినిమాల్లో తండ్రీ-కూతుళ్ల అనుబంధం అనేది కథలో పూర్తి స్థాయిలో కనిపించవచ్చు. కాగా, తెలుగులో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'డాడీ', 'నేను శైలజ', 'పరుగు' లాంటి సినిమాలు.. తండ్రి-కూతుర్ల మధ్య ఉండే గొప్ప బంధం చుట్టు తిరిగే కథలే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Kiara Khanna Hi Nanna Movie : ముద్దు ముద్దు మాటల కియారా.. 'హాయ్ నాన్న' చిన్నారి ఎవరో మీకు తెలుసా?
Big boss Bhagvant Kesari : బిగ్ బాస్‌లో 'భగవంత్ కేసరి'.. గత 20ఏళ్ల బాలయ్య కెరీర్లో తొలి సారి అలా!