ETV Bharat / entertainment

'RC 15' సినిమా 2024 సమ్మర్ కేనా? లేక ప్రభాస్​ 'ప్రాజెక్ట్​-K'తో పోటీకి రెడీ అవుతుందా? - ఆర్​ సీ 15 రీలీజ్​

మెగా హీరో రామ్​చరణ్​- డెరెక్టర్​ శంకర్ కాంబో తెరకెక్కుతున్న ఆర్​సీ 15 సినిమా ఇక 2024 సమ్మర్ కేనా? పోనీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్​ అయితే ప్రభాస్​ ప్రాజెక్ట్​-కె అడ్డం పడినట్లేనా? లేక పోటీ కి రెడీ అవుతుందా?

rc 15 release date
rc 15 release date
author img

By

Published : Feb 19, 2023, 10:41 AM IST

మెగా పవర్​ స్టార్​ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా​ 'ఆర్​సీ 15'. పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్​ చరణ్​కు జోడీగా కియారా అడ్వాణీతో పాటు అంజలి నటిస్తోంది. కాగా ఇప్పటికే ఈ మూవీ​ విదేశాలతో పాటు ఇండియాలోని పలు టాప్​ లోకేషన్స్​లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకొన్ని లొకేషన్స్​లో షూట్​ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలోకి దిగనున్నట్లు అప్పట్లో టాక్​ నడిచింది.

అయితే​ మధ్యలో శంకర్​ మరో ప్రాజెక్టైన ఇండియన్​ 2 షూటింగ్​ కూడా పెండింగ్​లో ఉన్నందున ఆ పనుల్లో బిజీ అయిపోయారు డైరెక్టర్​. దీంతో ఆర్​సీ 15 షూట్​ కూడా ​పెండింగ్​లో ఉండిపోయింది. అంతే కాకుండా హీరో హీరోయిన్ల బిజీ షెడ్యూల్​ వల్ల కూడా సినిమా విడుదల ఓ మేరకు వాయిదా పడిందనే చెప్పాలి. దీంతో ఇక సినిమా రిలీజయ్యేందుకు లేట్​ అవుతుందని ఫ్యాన్స్​ ఫిక్స్​ అయిపోయారు. అయితే తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ సమాచారం ప్రకారం ఈ సినిమా 2024 సమ్మర్​కు రిలీజయ్యేందుకు సన్నాహాలు చేస్తోందట.

పెండింగ్​ షూటింగ్​తో పాటు పోస్ట్​ ప్రొడక్షన్​ పనులను వేగంగా పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్​ డిసైడయ్యారట. ఒకవేళ సమ్మర్​కు కాకుండా ముందుగా అనుకున్నట్లు సంక్రాంతికి రిలీజైతే.. ప్రభాస్​ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్​-కెకు ఇది అడ్డం పడ్డట్లే అని నెటిజన్లు అంటున్నారు. ఇలా అయితే 2024 సంక్రాంతి బరిలోకి ఇద్దరు టాప్​ హీరోల పాన్ ఇండియా మూవీలు పోటీపడనున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్​ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్​గా రూపొందుతోంది 'ఆర్​సీ15'. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్‌జే సూర్య, నవీన్​ చంద్ర, సునీల్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్‌ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అటు ప్రాజెక్ట్​ కె లోనూ పలువురు దిగ్గజ స్టార్స్​ సందడి చేయనున్నారు. ప్రభాస్​ సరసన దీపిక నటిస్తుండగా, బిగ్​బి అమితాబ్​ బచ్చన్​ కీలక పాత్రలో నటించనున్నారు. వైజయంతి మూవీస్​ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగఅశ్విన్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్​ ప్రస్తుతం శరవేంగా జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.