F3 movie ticket price Dilraju: 'ఎఫ్ 3' సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్పందించారు. ధరల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరమవుతున్నారని అన్నారు. అందుకే 'ఎఫ్3'కి టికెట్ ధరలు పెంచలేదని తెలిపారు.
"కరోనా తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్‌లు పెరిగాయి. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూసేందుకు అలవాటుపడ్డారు. బడ్జెట్ పెరగడం వల్లే 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2'కు టికెట్ ధరలు పెరిగాయి. ధరల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరమవుతున్నారు. టికెట్ ధరలు అందుబాటులో లేక రిపీట్ ఆడియెన్స్ తగ్గిపోయారు. పాత జీవో ప్రకారమే ఎఫ్3కి టికెట్ ఉంచాం. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలనే ధరలు తగ్గించాం" అని అన్నారు.
కాగా, దగ్గుబాటి, మెగా హీరోల కాంబినేషన్‌లో వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్-2'. మూడేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన నవ్వుల సునామీని ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మర్చిపోరు. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్‌గా 'ఎఫ్-3' వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 27న విడుదల కానుంది.
ఇదీ చూడండి: ‘ఎఫ్3’ టికెట్ రేట్ల పెంపుపై దిల్‌రాజు ఏమన్నారంటే?