ETV Bharat / entertainment

ధోనీ బ్యానర్​లో ఫస్ట్​ మూవీ.. LGM తెలుగు టీజర్ ఆగయా.. ప్రమోషన్స్​లో మహీ! - ఎల్​జీఎం ప్రొడ్యూసర్​

LGM Movie Teaser : టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ నుంచి వస్తున్న తొలి చిత్రం 'ఎల్‍జీఎం'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. తెలుగులోనూ టీజర్ వచ్చింది. మరి మీరు చూశారా?

dhoni entertainment 1st movie LGM Movie telugu Teaser released

author img

By

Published : Jun 7, 2023, 10:02 PM IST

Updated : Jun 7, 2023, 10:25 PM IST

LGM Movie Teaser : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థాపించిన ధోనీ ఎంటర్‌టైన్‍మెంట్ లిమిటెడ్ బ్యానర్‌ నుంచి తొలి సినిమాగా 'ఎల్‍జీఎం'- లెట్స్ గెట్ మ్యారీడ్ వస్తోంది. ఈ చిత్రాన్ని ధోనీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ సమర్పిస్తున్నారు. తమిళంలో మూవీ రూపొందింది. కానీ తెలుగులోనూ విడుదల కానుంది. బుధవారం (జూన్ 7) ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. తెలుగులోనూ టీజర్ వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యూత్‍ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌!
'ఎల్‍జీఎం' చిత్రం యూత్‍ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తాజా టీజర్ చూస్తే అర్థమవుతోంది. కామెడీ కూడా ప్రధానాంశంగా ఉండనుంది. పెళ్లి విషయంలో ప్రేయసి, తల్లి మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథగా ఈ మూవీ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఎల్‍జీఎం సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో టీజర్‌తో ప్రమోషన్‍లను చిత్రయూనిట్ ప్రారంభించింది.

యంగ్​హీరో- లవ్​టుడే బ్యూటీ!
LGM Movie Cast : 'ఎల్‍జీఎం' సినిమాలో తమిళ యువ నటుడు హరీశ్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. లవ్​టుడే ఫేమ్ ఇవానా.. హీరోయిన్​గా కనిపించనున్నారు. సీనియర్ నటి నదియా, ప్రముఖ కమెడియన్ యోగి బాబు, ఆర్జే విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రమేశ్ తమిళ్‍మణి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్షన్‍తో పాటు సంగీత దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే, మాటల రచన బాధ్యతలను కూడా తమిళ్‍మణి నిర్వర్తిస్తున్నారు.

ధోనీ బ్యానర్​.. ఫస్ట్​ సినిమా..
Dhoni Entertainment 1st Movie : ధోనీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ నుంచి తొలి సినిమా కావడంతో 'ఎల్‍జీఎం'పై చాలా ఆసక్తి నెలకొంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం తమిళం, తెలుగు టీజర్లను విడుదల చేసింది. అయితే, విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు. కమింగ్ సూన్ ఇన్ సినిమాస్ అని పేర్కొంది.

IPL 2023 Winner CSK : కాగా, ఈ ఏడాది ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటిల్ అందించాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అనంతరం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రాంచీలోనూ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఎల్‍జీఎం మూవీ ప్రమోషన్లు త్వరలో ముమ్మరంగా జరిగే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఈ మూవీ ప్రమోషన్లలో ఎంఎస్ ధోనీ పాల్గొనే ఛాన్స్ కూడా ఉంది.

  • 𝙒𝙚 𝙖𝙧𝙚 𝙩𝙝𝙚 𝘾𝙝𝙚𝙣𝙣𝙖𝙞 𝘽𝙤𝙮𝙨
    𝙈𝙖𝙠𝙞𝙣𝙜 𝙖𝙡𝙡 𝙩𝙝𝙚 𝙣𝙤𝙞𝙨𝙚
    𝙀𝙫𝙚𝙧𝙮𝙬𝙝𝙚𝙧𝙚 𝙬𝙚 𝙜𝙤! 🥳🥳#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yw9sv30xLz

    — Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jun 7, 2023, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.