ETV Bharat / entertainment

Devara Janvi Kapoor Look : జాన్వీ పాత్ర ఇదే.. లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా.. తారక్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ - దేవర జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్​

Devara Janvi Kapoor Look : 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్​ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జాన్వీ.. లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా చిరునవ్వులు చిందిస్తూ కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్​ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Devara Janvi Kapoor Look : లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా.. తారక్ ఫ్యాన్స్ ఫిదా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 8:27 AM IST

Updated : Nov 1, 2023, 8:54 AM IST

Devara Janvi Kapoor Look : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్​ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్​గా నటిస్తోంది. తాజాగా మూవీటీమ్​.. జాన్వీ కపూర్​ పాత్రను పరిచయం చేస్తూ ఓ లుక్​ను విడుదల చేసింది. లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా కనిపిస్తున్న జాన్వీ స్టిల్​ను దేవర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేలేత పరువాల జాన్వీ చిరునవ్వులు చిందిస్తూ.. చూడగానే ఆకట్టుకునేలా కనిపించింది. మెడలో చిన్న తాయత్తు లాంటింది ధరించి.. సాదాసీదా గ్రామీణ అమ్మాయిగా చూడముచ్చటగా కనిపించింది. ఈ పిక్​ చూసిన నెటిజన్లు శ్రీదేవీ చూసిన ఫీలింగ్ కలుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ చిత్రంలో జాన్వీ పోషిస్తున్న పాత్ర పేరు 'తంగం'. 'ఇదిగో మా తంగం' అంటూ చిత్రబృందం క్యాప్షన్ రాసుకొచ్చింది. 'దేవర' చిత్రం ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్​లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్ కోసం రీసెంట్​గానే గోవా వెళ్లారు. ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ భైరా అనే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

కాగా, జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. 'ధడక్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా విజయం సాధించడం వల్ల ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసింది. గుంజన్ సక్సేనా, రూహీ, మిలి.. అనంతరం వరుణ్​ ధావన్​తో బవాల్ చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు ఆశించిన రేంజ్​లో ఆకట్టుకోలేదు. అయితే కెరీర్​ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇకపోతే చాలా కాలం నుంచి తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూసిన ఈ భామ.. తారక్​ దేవర చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

షాకింగ్​.. రూ.60 కోట్ల బడ్జెట్​తో స్టార్ హీరోయిన్​ చిత్రం.. రూ.6 కోట్లు కూడా రాలేదు!

Jahnvi Kapoor : ఎన్టీఆర్ కోసం ఏడాది కాలంగా.. ఫీలింగ్స్ బయటపెట్టిన హీరోయిన్

Last Updated : Nov 1, 2023, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.