Complaint on Ranveer: బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్.. ఇటీవలే పోస్ట్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ ప్రస్తుతం చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆయన దిగిన ఫొటోలు బాగా వైరల్‌గా మారాయి. అయితే ఇది వివాదస్పదమైంది. రణ్వీర్ను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరూ తప్పుబడుతున్నారు.
అయితే తాజాగా ముంబయిలోని చెంబూర్ పోలీస్ స్టేషన్లో రణ్‌వీర్‌పై ఫిర్యాదు నమోదైంది. ఓ ఎన్జీఓ సంస్థ ఈ కంప్లెయింట్ ఇచ్చింది. రణ్వీర్.. మహిళల మనోభావాలను దెబ్బతీశాడని, వారిని అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ 'సర్కస్', 'రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ' అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన భార్య హీరోయిన్ దీపికా పదుకోణె.. 'ప్రాజెక్ట్ K', 'పఠాన్' చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: కదలలేని స్థితిలో కైకాల.. బైడ్పైనే కేక్ కట్ చేయించిన చిరు