ఇటీవలే గాడ్‌ఫాదర్ సినిమాలో సూపర్ సక్సెస్‌ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్యతో బిజీగా గడపుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. చిత్రీకరణలో భాగంగా ఓ సాంగ్ షూట్ కోసం ఆయన కథానాయిక శ్రుతిహాసన్‌తో కలిసి యూరప్ వెళ్లారు. తన కుటుంబసభ్యులను కూడా వెంట తీసుకుళ్లారు. దీనకి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫ్యామిలీతో విహార యాత్ర హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర అంటూ సరదా వ్యాఖ్య జోడించారు.
కాగా, వినూత్నమైన మాస్ యాక్షన్ కథాంశంతో బాబీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ నాయిక. ఇందులో హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్.
-
ఫ్యామిలీ తో అటు విహార యాత్ర
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4
">ఫ్యామిలీ తో అటు విహార యాత్ర
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022
హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4ఫ్యామిలీ తో అటు విహార యాత్ర
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022
హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4
ఇదీ చూడండి: ఆ స్టార్ హీరో సినిమాతో సింగర్ సునీత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ