Chiranjeevi Farm House Bangalore: మెగాస్టార్ ఫ్యామిలీ 2024 సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంది. బెంగళూరులోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి- అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. ఇక తాజాగా వీరంతా తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. షెడ్యుల్ ప్రకారం ఎవరి పనిలో వారు బిజీగా ఉండనున్నారు. అయితే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఓ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
మెగాఫ్యామిలీ సంక్రాంతి వేడుక చేసుకున్న ఫామ్‌హౌజ్ గురించి నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఫామ్‌హౌజ్ ఎక్కడ ఉంది? దాని ఖరీదు ఎంత ఉంటుంది? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చిరంజీవికి చెందిన ఈ ఫామ్‌హౌజ్ బెంగళూరుకు దాదాపు 35 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది. ఇక్కడ్నుంచి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు చాలా దగ్గర్లో ఉంటుందట. ఇక ఈ ఫామ్‌హౌజ్ ఖరీదు రూ.30 కోట్లు ఉండవచ్చని అంచనా. మెగాఫ్యామిలీకి సంబంధించిన ఏ పార్టీయైనా, వేడుకైనా ఇక్కడే జరుపుకుంటారు.
-
#Boss Megastar Chiranjeevi's House In Bangalore ..
— Ahiteja Bellamkonda (@ahiteja) February 10, 2015 " class="align-text-top noRightClick twitterSection" data="
Loved It 👌👌 pic.twitter.com/HhK1pY7U9k
">#Boss Megastar Chiranjeevi's House In Bangalore ..
— Ahiteja Bellamkonda (@ahiteja) February 10, 2015
Loved It 👌👌 pic.twitter.com/HhK1pY7U9k#Boss Megastar Chiranjeevi's House In Bangalore ..
— Ahiteja Bellamkonda (@ahiteja) February 10, 2015
Loved It 👌👌 pic.twitter.com/HhK1pY7U9k
చిరు, నాగబాబు విషెస్: సంక్రాంతి పండగ వేళ మెగాబ్రదర్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ విషెస్ తెలిపారు. మొదట చిరంజీవి గ్రూప్ ఫొటో షేర్ చేస్తూ 'పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!' అని రాసుకొచ్చారు. ఇక తాజాగా నాగబాబు, అన్నయ్య చిరుతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోకు 'పండుగలు కుటుంబాల మధ్య మనుషుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయి, నా హృదయానికి అత్యంత దగ్గరైన మనషుల సమక్షంలో ఈ పండుగను జరుపుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని నింపింది. ఇది నా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచి ఉంటుంది' అనే క్యాప్షన్‌ను జోడించారు.
ఇక సినిమాల విషయానికొస్తే: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర', అల్లు అర్జున్ 'పుష్ప-2', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌లు రీ స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు వరున్‌తేజ్ బుధవారం (జనవరి 17) పంజాబ్ అమృసర్ గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు.