'లడ్కీ(అమ్మాయి)' సినిమా స్క్రీనింగ్ ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. ఫోర్జరీ సంతకాలతో కూడిన నకిలీ కాగితాలు, స్టేట్మెంట్లతో కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నారు. అయితే కోర్టు ఆ స్టే అప్పీళ్లను కొట్టేవేసి.. తన సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చినట్లు ఆర్జీవీ వివరించారు.
"నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై అనేక సెక్షన్ల కింద చర్య తీసుకోబోతున్నాను. నా కంపెనీ లెటర్ హెడ్‌ని ఫోర్జరీ చేసిన ఎన్.రవి కుమార్ రెడ్డిపై ద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఫైల్ చేయడమే కాకుండా.. థియేటర్లలో నడుస్తున్న నా సినిమాను ఆపినందుకు పరువు నష్టం దావా కూడా వేస్తా. నాకు జరిగిన నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా వసూలు చేస్తాను."
రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు
శేఖర్ రాజ్ అనే వ్యక్తి అబద్ధపు స్టేట్మెంట్లతో కోర్టును మభ్య పెట్టినట్లు చెప్పారు ఆర్జీవీ. అతనిపై ఫోర్జరీ నేరం కింద కేసు పెట్టబోతున్నట్లు పేర్కొన్నారు.తనతో పాటు లడ్కీ సినిమా ప్రొడ్యూసర్స్ ఆస్ట్రీ మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ నిర్వాహకులు కూడా ఇద్దరిపై కేసులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు ఆర్జీవీ.
ఇదీ చదవండి: 'సైఫ్ ఇప్పటికే చాలా చేశాడు'.. మూడోసారి ప్రెగ్నెన్సీపై కరీనా కపూర్