ETV Bharat / entertainment

రణ్​బీర్​కు తెలుగు నేర్చుకోవడానికి అన్ని రోజులు పట్టిందా? - రణ్​బీర్​కపూర్​ బ్రహ్మస్త్రం ప్రీ రిలీజ్​ ఈవెంట్​

'నేను ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించండి. త్వరలోనే మరింత మెరుగు పరుచుకుంటా' అని అన్నారు బాలీవుడ్ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​. ఎందుకంటే..

Ranbir kapoor
రణ్​బీర్​ కపూర్​
author img

By

Published : Sep 3, 2022, 12:50 PM IST

Updated : Sep 3, 2022, 2:56 PM IST

బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్​ చిత్రం 'బ్రహ్మాస్త్రం'. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిగ్​బీ అమితాబ్ బచ్చన్​, నాగార్జున కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 9న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని ప్లాన్‌ చేయగా.. అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. దీంతో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించగా.. ఇందులో రణ్‌బీర్‌ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నారు. తాను తెలుగు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో చెప్పారు.

''నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌ 'బ్రహ్మాస్త్ర'. బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ కూడా ఇదే. మంచి చిత్రాన్ని ఎప్పుడూ ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా చిత్రం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన అక్కినేని, నందమూరి, రాజమౌళి అభిమానులందరికీ థ్యాంక్యూ. 'బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 2' సమయానికి తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటా. నేను ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించండి'' అని రణ్‌బీర్‌ పేర్కొన్నారు. తన భర్త మొదటిసారి తెలుగులో మాట్లాడడంతో అలియా ఫిదా అయ్యారు. ఇక, రాజమౌళి అయితే అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.

''ఆర్ఆర్‌ఆర్‌'లో నటించడం వల్ల నేనూ రాజమౌళి సర్‌ హీరోయిన్‌ అని చెప్పుకొనే అవకాశం లభించింది. మీరు హీరోలా నిలబడి మా చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు లేకపోతే 'బ్రహ్మాస్త్ర' పూర్తయ్యేది కాదు. అయాన్‌ మిమ్మల్ని ఎంతో అభిమానిస్తుంటాడు. అలాంటిది ఈరోజు మీరు ఆయన తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి సపోర్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రానికి తారక్‌ సపోర్ట్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన మంచి మనసుకు ఇదొక నిదర్శనం'' అంటూ అలియా 'బ్రహ్మాస్త్ర'లోని 'కుంకుమలా' పాటను పాడి అలరించారు.

ఇదీ చూడండి: రూ.200కోట్ల మనీలాండరింగ్​ కేసు.. పోలీసుల ఎదుట హాజరైన స్టార్​ నటి

Last Updated : Sep 3, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.