ETV Bharat / entertainment

త్వరలో నటనకు హాలీవుడ్​ హీరో బ్రాడ్ పిట్ దూరం.. మాలీవుడ్​లోకి మైత్రీ మూవీ మేకర్స్ - mythri movie makers news

హాలీవుడ్ అగ్ర​ నటుడు బ్రాడ్ పిట్.. షాకింగ్​ ప్రకటన చేశారు. తన నట ప్రస్థానంలో చివరి దశలో ఉన్నట్లు.. తర్వలో పూర్తిస్థాయిలో సినిమాలకు దూరం కానున్నట్లు ప్రకటించారు. అలాగే టాలీవుడ్​లో టాప్​ నిర్మాణ సంస్థ.. ఎంట్రీ ఇస్తోంది.

Brad Pitt Says His Acting Career Is on Its Last Leg
త్వరలో నటనకు బ్రాడ్ పిట్ దూరం.. మాలీవుడ్​లోకి మైత్రీ మూవీ మేకర్స్
author img

By

Published : Jun 23, 2022, 5:33 PM IST

ఆస్కార్ విజేత, హాలీవుడ్ అగ్ర​ నటుడు బ్రాడ్ పిట్ సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను నటనకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. ఒక మ్యాగజైన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు బ్రాడ్ పిట్. మరో మూడు లేకుంటే ఆరు నెలల్లో నటనకు పూర్తిస్థాయిలో స్వస్తి చెబుతానని వెల్లడించారు. ఈ ప్రకటనతో బ్రాడ్ పిట్ అభిమానులు నిరాశకు లోనయ్యారు.

'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' సినిమాకు ఇటీవల ఆస్కార్​ అవార్డును అందుకున్నారు బ్రాడ్​ పిట్​. ఆయన నటించిన బుల్లెట్ ట్రైన్ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది. బ్రాడ్ పిట్ తన మాజీ భార్య ఏంజెలినా జోలీతో న్యాయ వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇద్దరి భాగస్వామ్యంలో ఉన్న వైన్ వ్యాపారంలో జోలీ.. తన వాటాలను విక్రయించారు. ఈ క్రమంలో బ్రాడ్ పిట్ కోర్టులో పిటిషన్ వేశారు.

మాలీవుడ్​లో 'మైత్రీ మూవీ మేకర్స్'..

వరుస హిట్లతో టాలీవుడ్​లో టాప్​ నిర్మాణ సంస్థగా వెలుగొందుతోంది 'మైత్రీ మూవీ మేకర్స్'. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్​, రంగస్థలం, ఉప్పెన, పుష్ప లాంటి సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు మంచి గుర్తింపు లభించింది. మెగాస్టార్​ చిరంజీవితో మెగా154, బాలయ్యతో ఎన్​బీకే107, పుష్ప-2, విజయ్​ దేవరకొండ సినిమాలు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా టాలీవుడ్​లో వరుస సినిమాలు చేస్తూనే.. ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మాలీవుడ్ యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తూ.. తన సొంత నిర్మాణ సంస్థపై డాక్టర్ బిజు దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ 'అదృశ్య జాలకంగల్'. అయితే ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్.. నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దీంతో మాలీవుడ్​లోకి కూడా మైత్రీ మూవీ మేకర్స్ అడుగుపెట్టినట్లయింది.

ఇదీ చదవండి: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం.. దిల్​రాజు అధ్యక్షతన కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.