Bimbisara OTT Release Date: దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం 'బింబిసార'. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశారు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్‌ను ఖాతాలో వేసుకుంది. థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది.
ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్‌ఫామ్ జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జీ5 సంస్థ ఓటీటీలోకి తీసుకువస్తోంది. అక్టోబర్ 21న ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చేసింది.
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరిన్, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసారుడు' అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో అదరగొట్టారు.
నెట్‌ఫ్లిక్స్‌లో 'దొంగలున్నారు జాగ్రత్త'
అమెజాన్ ప్రైమ్‌లో జేమ్స్‌బాండ్ చిత్రాలు
1962లో 'డాక్టర్ నో'తో మొదలైన బాండ్ సిరీస్‌లో ఇప్పటివరకూ 25 చిత్రాలు వచ్చాయి. గతేడాది 'నో టైమ్ టు డై' 25వ చిత్రంగా విడుదలైంది. ఇప్పుడు ఈ 25 చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చింది.ఇండియా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, మెక్సికో, స్పెయిన్, సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంత వాసులు వీటిని వీక్షించవచ్చు. అయితే, ఇది ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే కల్పించనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. ఇంకెందు ఆలస్యం ఈ దసరా సెలవుల్లో నచ్చిన బాండ్ సినిమాలను వరుసగా చూసేయండి.
ఇవీ బాండ్ సినిమాలు..: డాక్టర్ నో (1962), ఫ్రమ్ రష్యా విత్ లవ్ (1963), గోల్డ్ ఫింగర్ (1964), థండర్ బాల్ (1965), యు ఓన్లీ లివ్ ట్వైస్ (1967), ఆన్ హర్ మెజస్ట్రీ సీక్రెట్ సర్వీస్ (1969), డైమండ్స్ ఆర్ ఫరెవర్ (1971), లివ్ అండ్ లెట్ డై (1973), ది మ్యాన్ విత్ గోల్డెన్ గన్ (1974), ది స్పై హూ లవ్డ్ మి (1977), మూన్‌రేకర్ (1979), ఫర్ యువర్ ఐస్ ఓన్లీ (1981), ఆక్టోపస్సీ (1983), ఎ వ్యూ టు ఎ కిల్ (1985), ది లివింగ్ డేలైట్స్ (1987), గోల్డెన్ ఐ (1995), టుమారో నెవ్వర్ డైస్ (1997), ది వరల్డ్ ఈజ్ నాట్ ఇనఫ్ (1999), డై అనదర్ డే (2002), క్యాసినో రాయల్ (2006), క్వాంటమ్ ఆఫ్ సొలెస్ (2008), స్కైఫాల్ (2012), స్పెక్టార్ (2015), నో టైమ్ టు డై(2021)
ఇవీ చదవండి: పుష్ప-2లో సుకుమార్‌కు నో రెమ్యునరేషన్!.. బన్నీకి రూ.125 కోట్లు?
నటి శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు నమోదు.. ఫిర్యాదు చేసింది ఆయనే