ETV Bharat / entertainment

సంక్రాంతి బరిలో బాలయ్య.. 'ఎన్​బీకే 107'కు పవర్​ఫుల్​ టైటిల్​ ఫిక్స్​ - ఎన్​బీకే 107 టైటిల్​ లోగో రిలీజ్​

బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబోలో పవర్​ఫుల్​ సినిమాగా రూపొందుతున్న ఎన్​బీకే 107 టైటిల్​ను ప్రకటించారు మేకర్స్​. ఏంటంటే...

Balakrishna Gopichand malineni title teaser released
బాలయ్య ఎన్​బీకే 107కు పవర్​ఫుల్​ టైటిల్​
author img

By

Published : Oct 21, 2022, 8:18 PM IST

Updated : Oct 21, 2022, 8:29 PM IST

అఖండ విజయంతో ఫుల్​ జోష్​ మీదున్న నటసింహ బాలకృష్ణ.. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై అదరగొట్టేస్తున్నారు. త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్​ 'ఎన్​బీకే 107'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద భారీగా టైటిల్​ లోగో ఈవెంట్​ను నిర్వహించి పేరును ప్రకటించారు. టైటిల్​ లోగోను ఘనంగా విడుదల చేశారు. సినిమాకు 'వీరసింహారెడ్డి' అని టైటిల్​ను ఖరారు చేశారు. టాలీవుడ్‌ చరిత్రలోనే తొలిసారిగా టైటిల్‌ లాంచ్‌కు వేడుక నిర్వహించారు. అభిమానుల సమక్షంలో పేరును ప్రకటించారు. కాగా, ఈ ఈవెంట్​కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్​ తరలివచ్చారు. బాలయ్యపై తమ అభిమానాన్ని చాటుతూ జై బాలయ్య అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్​.

కాగా, గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో లేడీ పవర్​ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: బాలయ్య సజెస్ట్ చేసిన సినిమాతో పవన్​ సూపర్​హిట్​.. ఆ మూవీ ఏంటంటే?

Last Updated : Oct 21, 2022, 8:29 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.