Baby OTT Release Date Telugu : సాధారణ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'బేబీ'. సాయి రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను కట్టిపడేశారు. జులై 14న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్ల వసూళ్లను రాబట్టింది.
Baby Movie Aha Release Date : ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని సినీ అభిమానులు ఎదురు చూశారు. వారికి శుభవార్త వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'ఆహా'లో 'బేబీ' మూవీ ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' ఓటీటీ సంస్థ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసింది. దీంతో పాటు ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. 'ఆహా గోల్డ్' సబ్స్క్రిప్షన్ కలిగిన వారు.. ఈ చిత్రాన్ని 12 గంటల ముందే చూడొచ్చు. అంటే ఆగస్టు 24 సాయంత్రం 6 గంటల నుంచి గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో ఎక్కువ రన్‌టైమ్?
Baby Movie Runtime : ఇటీవల ఈ సినిమా రన్‌టైమ్‌పై వార్తలు వచ్చాయి. అందులో సుమారు 3 గంటల నిడివి కలిగిన ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం 4 గంటల రన్టైమ్తో రానుందట. మరో పాట సహా.. కొన్ని సన్నివేశాలను సినిమాలో చేర్చనున్నారని సమాచారం. కాగా ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య, నటుడు విరాజ్ మధ్య ఎక్కువ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండకు సంబంధించి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇవన్నీ సాధ్యమైతే ఓటీటీలోకి 'బేబీ' నాలుగు గంటల రన్టైమ్తో సందడి చేయనుంది.
'బేబీ' కథ ఇదే..
Baby Movie Story Telugu : వైషు అలియాస్ వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఓ బస్తీకి చెందిన అమ్మాయి. ఆమె చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను ఆనంద్ కూడా అంగీకరిస్తాడు. వీరి ప్రేమ పాఠశాల రోజుల్లోనే ముదురుతుంది. అయితే పదో తరగతి ఫెయిల్ కావడం వల్ల ఆనంద్ ఆటో డ్రైవర్‌గా స్థిరపడతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడ కొత్త పరిచయాల వల్ల.. వైషూ ఆలోచనా విధానంలో మార్పులు మొదలై.. ఈ క్రమంలోనే ఆమె తన క్లాస్‌మేట్ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. ఈ క్రమంలోనే అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్‌కు వైష్ణవి శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. అయితే ఆ తర్వాత ఏమైంది? వీరిద్దరి వ్యవహారం ఆనంద్‌కు తెలిసిందా? నిజం తెలిశాక ఆనంద్ ఎలా స్పందించాడు? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కలెక్షన్లలో దూసుకెళ్తున్న 'బేబీ'.. తొమ్మిది రోజుల్లోనే ఇన్ని కోట్లా?
13 రోజులైనా ఆగని 'బేబీ' జోరు.. ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే?