ETV Bharat / entertainment

'సినిమాలు ఆడకపోవచ్చు.. కానీ నటిగా ఓడిపోలేదు' - urvashivo rakshasivo movie

అనూ ఇమాన్యూయేల్​.. 'మజ్ను'తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన మరో చిత్రం 'ఊర్వశివో రాక్షసివో' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ విషయాలివే..

అనూ ఇమాన్యుయేల్
anu emmanuel
author img

By

Published : Nov 3, 2022, 6:49 AM IST

మంచి కథని ఎంచుకోవడం.. ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంటుందని చెబుతోంది అను ఇమ్మానుయేల్‌. చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ, నటిగా మాత్రం నేనెప్పుడూ ఓడిపోలేదంటోంది. తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో ఆడిపాడిన అను ఇమ్మానుయేల్‌.. ఈమధ్య ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఇటీవల అల్లు శిరీష్‌తో కలిసి 'ఊర్వశివో రాక్షసివో' అనే చిత్రంలో ఆడిపాడింది. రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అను ఇమ్మానుయేల్‌ బుధవారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివే..

"ఒక సినిమా అవకాశం వచ్చిందంటే సహజంగానే హీరో ఎవరు? ఇతరత్రా నటులు, నిర్మాణ సంస్థ తదితర విషయాల్ని ఆరా తీస్తుంటాం. కానీ రెండు మూడేళ్లుగా సినిమా రంగంలో చాలా మార్పులొచ్చాయి. ప్రేక్షకులకి హీరో ఎవరనే విషయం కంటే కూడా, కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కథ బాగుందంటే మిగతా విషయాల్ని పట్టించుకోరు. కొన్ని సినిమాల ఫలితాల్ని చూశాక నటిగా నేనూ కథల ఎంపిక శైలి మార్చుకున్నా. మూస కథలకి దూరంగా ఉంటున్నా. నా దగ్గరికొచ్చిన పాత్రకి నేను సరిపోతానా లేదా అని చూస్తున్నా. నాకు తగ్గ పాత్ర కాదనుకున్నప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నానే తప్ప, ఏదో ఒకటి చేసేద్దాం అని మాత్రం తొందరపడటం లేదు. 'ఊర్వశివో రాక్షసివో' కథ, ఇందులోని సింధు పాత్ర, నిర్మాత అల్లు అరవింద్‌ మాటలే నన్ను ఈ సినిమా చేయడానికి ప్రేరేపించాయి. పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తా".

"నేను పోషించిన సింధు పాత్రకీ, నా వ్యక్తిగత జీవితానికీ చాలా పోలికలు ఉన్నాయి. సింధు సాఫ్టవేర్‌ అమ్మాయి. కెరీర్‌ పరంగా నేనూ, సింధు ఒకేలా ఆలోచిస్తుంటాం. అందుకే ఆ పాత్రలో నేను అంతగా ఒదిగిపోయానేమో అనిపిస్తుంది. సినిమా సెట్‌కి వెళ్లడానికి ముందే శిరీష్‌, నేను కలిసి కథ, పాత్రల గురించి మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్య ప్రేమ, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. కెరీరే ప్రపంచం అనుకునే అమ్మాయికీ, ఓ సాధారణ కుర్రాడికీ మధ్య ప్రేమ ఎలా చిగురించింది? వేర్వేరు భావాలున్న ఆ ఇద్దరూ ఎలా కలిసి ప్రయాణం చేశారన్నది కీలకం. దర్శకుడు రాకేశ్‌ శశి ఎంతో స్పష్టతతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. కళ్లతోనే అభినయిస్తుందనే పేరు తెచ్చుకున్నా. అంతకంటే ఏం కావాలి? విజయాలు నా చేతుల్లో ఉండవు కదా? అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం రవితేజతో కలిసి 'రావణాసుర' చేస్తున్నా. ఓటీటీలో కొన్ని ప్రాజెక్ట్స్‌ చేస్తున్నా".

ఇదీ చదవండి: ఈ ముద్దుగుమ్మలు ధరించిన డ్రెస్​ అంత కాస్ట్లీనా

మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.