Alluarjun Harishshankar: అల్లుఅర్జున్-హరీశ్ శంకర్.. ఈ కాంబోకు స్పెషల్ క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'డీజే'(దువ్వాడ జగన్నాథమ్) మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ.. ఫ్యాన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ స్టైల్, సాంగ్స్, స్టెప్పులు అభిమానులను చేత ఈలలు వేయించింది. దీంతో వీరిద్దరి కలయికలో మరో సినిమా తెరకెక్కితే ఫుల్‌మీల్స్ ఆస్వాదిద్దామని ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే బన్నీ ప్రస్తుతం 'పుష్ప 2' కోసం సన్నద్ధం అవుతున్నాడు. కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యం అయ్యేలా ఉంది. దీంతో ఆయన.. కొత్త కథలను వినే పనిలో పడ్డారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన హరీశ్శంకర్తో ఓ సినిమా చేయబోతున్నారని ఈ మధ్య కాలంలో ప్రచారం సాగింది. అంతలోనే కొన్ని కారణాల వల్ల మళ్లీ ఆ కాంబో సెట్ కాలేదని కథనాలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడీ కలయికే ఓకే అయినట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈ సారి సినిమా కోసం కాదు. ఓ యాడ్ కోసం కలిసి పనిచేయనున్నారు. ఈ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం అల్లుఅర్జున్ను హరీశ్‌శంకర్ కలిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీనిపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఓ అదిరిపోయే సినిమాను తెరకెక్కించాలని కోరుతున్నారు.
-
Icon Staar @alluarjun & Powerful Director @harish2you join hands for an AD Shoot #AlluArjun #HarishShankar pic.twitter.com/NBoHPHgnpG
— Vamsi Kaka (@vamsikaka) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Icon Staar @alluarjun & Powerful Director @harish2you join hands for an AD Shoot #AlluArjun #HarishShankar pic.twitter.com/NBoHPHgnpG
— Vamsi Kaka (@vamsikaka) July 14, 2022Icon Staar @alluarjun & Powerful Director @harish2you join hands for an AD Shoot #AlluArjun #HarishShankar pic.twitter.com/NBoHPHgnpG
— Vamsi Kaka (@vamsikaka) July 14, 2022
కాగా, 'పుష్ప 2' షూటింగ్ ప్రారంభంపై ఇంకా క్లారిటీ లేదు. 'పుష్ప' తొలి భాగంగా అదిరిపోయే విజయం సాధించడం వల్ల రెండో భాగాన్ని అంతకుమించి రూపొందించేలా దర్శకుడు సుకుమార్ కథను తయారు చేస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో సీక్వెల్‌ను రూపొందించబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చాలా కాలం క్రితమే పోస్టర్లను విడుదల చేశారు దర్శకుడు హరీశ్‌శంకర్. కానీ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఈ మధ్య సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇదీ చూడండి: 'ఒకప్పుడు హీరోయిన్లకు ఆ కొలతలు చూసేవారు!'