ETV Bharat / entertainment

అయ్యో అఖిల్​.. 'ఏజెంట్​'కు ఎన్ని కష్టాలో? - అఖిల్ ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు నాగార్జున

అఖిల్ ఏజెంట్​ సినిమాకు.. అనౌన్స్ చేసినప్పటి నుంచి వరుసగా కష్టాలు ఎదురౌతూనే ఉన్నాయి. ఆ సంగతులు..

Akhil Agent movie difficulties
అయ్యో అఖిల్​.. 'ఏజెంట్​'కు ఎన్ని కష్టాలో?
author img

By

Published : Apr 23, 2023, 10:55 AM IST

Updated : Apr 23, 2023, 1:05 PM IST

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకుడు. స్టైలిష్​ అండ్​ హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్​లో రూపొందిందీ చిత్రం. అఖిల్ కెరియర్​లోనే హైయెస్ట్ బడ్జెట్​తో రాబోతున్న చిత్రమిది. దాదాపు రూ.80కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ఈ మూవీ ఆడియెన్స్​ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతోనే సురేందర్​ రెడ్డి నిర్మాతగా మారారు. సాక్షి వైద్య హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్​, టీజర్​, ట్రైలర్​తో సినిమాపై మూవీ లవర్స్​లో మంచి అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్​ చేసినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఏదో ఒకటి చిత్రానికి అడ్డుగా నిలుస్తూనే ఉన్నాయి. అలా బ్యాడ్ లక్​ ఈ చిత్రాన్ని వెంటాడుతూనే ఉంది.

ఈ చిత్ర షూటింగ్​ను రెండేళ్ల క్రితమే ప్రారంభించింది మూవీటీమ్​. అయితే సురేందర్ రెడ్డి ఆ మధ్యలో కాస్త అనారోగ్యం పడటం వల్ల ఆలస్యమవుతూ వచ్చిందని టాక్ వినిపించింది. మూవీ ప్రారంభించినా కొంతకాలానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలమే పట్టింది. లాక్​డౌన్ వల్ల కూడా షూటింగ్​ వాయిదా పడుతూ వచ్చింది. అలా సినిమా రిలీజ్​కు కూడా పోస్ట్​పోన్​ అవుతూ వచ్చింది.

ఫైనల్​గా సినిమా రిలీజ్​కు రెడీ అవుతున్న నేపథ్యంలో మొదట్లో ఆశించిన స్థాయిలో బజ్ కూడా క్రియేట్ కాలేదు. దీంతో పాన్ ఇండియాగా రావాల్సిన ఈ ప్రాజెక్ట్ కాస్త.. తెలుగు, మలయాళీ భాషలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఇదే సమయంలో ఏజెంట్​లో కీలక పాత్ర పోషించిన మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తల్లి రీసెంట్​గా మరణించారు.

ఇంకోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​లుగా రామ్​చరణ్​, ప్రభాస్ వస్తారని ప్రచారం సాగింది. కానీ బిజీ షెడ్యూల్​ కారణంగా అది కూడా కుదరలేదని తెలిసింది! సీనియర్ హీరో నాగార్జున​ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మూవీటీమ్ తాజాగా​ ప్రకటించింది. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చిత్ర నిర్మాత అనిల్ సుంకర కూడా హాజరుకాలేకపోతున్నారని వినికిడి. మరోవైపు.. ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్​ సాంగ్​ను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అది కూడా వాయిదా పడింది. ఇలా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏజెంట్ చిత్రానికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ రీసెంట్​గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్​తో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్స్​లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Actress Divi : 'ఎవరైనా నా ముడి విప్పండి'.. సీక్రెట్​ ప్లేస్​లోని టాటూ చూపిస్తూ..

Last Updated : Apr 23, 2023, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.