ETV Bharat / entertainment

విజయ్​ 'వారిసు'ను అజిత్ 'తునివు' ​బీట్​ చేసిందిగా! - విజయ్​ వారిసు తొలి రోజు కలెక్షన్స్​

భారీ అంచనాలతో విజయ్​ 'వారిసు', అజిత్​ 'తునివు' చిత్రాలు రిలీజయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు తొలి రోజు ఎంత కలెక్ట్ చేశాయంటే..

Ajith Tunivu Vijay Varisu First day collections
విజయ్​ 'వారిసు'ను అజిత్ 'తునివు' ​బీట్​ చేసిందిగా!
author img

By

Published : Jan 12, 2023, 6:59 PM IST

ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాల జాతర మొదలైపోయింది. తెలుగులో వీరసింహా రెడ్డి-వాల్తేరు వీరయ్య(జనవరి 13న విడుదల) బరిలో దిగగా తమిళనాట అజిత్‌ తునివు(తెగింపు), విజయ్‌ వారీసు(వారసుడు) బాక్సాఫీస్‌ వద్ద పోటీపడుతున్నాయి. అయితే ఈ రెండు తమిళ సినిమాలు జనవరి 11న గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. కానీ మొదటి రోజు కలెక్షన్లను కలిపితే రూ.50కోట్ల గ్రాస్​ కూడా దాటలేదు. తమిళనాడులో తునివు మొదటిరోజు 24.59 కోట్లు అందుకోగా.. వారీసు దాదాపుగా 19.43కోట్లు కలెక్ట్​ చేసినట్లు తెలిసింది. కాగా తొమ్మిదేళ్ల తర్వాత అజిత్‌, విజయ్‌ సినిమాలు ఒకేరోజు రిలీజ్‌ అయ్యాయి. దీంతో తొలి రోజు మొదటి షో చూడాలన్న ఫ్యాన్స్‌ అత్యుత్సాహం వల్ల కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

కాగా, ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి వారిసును తెరకెక్కించారు. రష్మిక కథానాయిక. ఈ సినిమాలో హీరో సోదరులుగా సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, ‘కిక్‌’ శ్యామ్‌ నటించారు. శరత్‌కుమార్‌, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో 'వారసుడు' పేరుతో జనవరి 14 నుంచి ఈ సినిమా సందడి చేయనుంది. ఇక తునివు విషయానికొస్తే.. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు హెచ్‌. వినోద్‌. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐవీవై ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మంజు వారియర్ కథానాయిక.

ఇదీ చూడండి: Waltair Veerayya: ఆ విషయంలో చిరు అసంతృప్తి.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.