Adipurush Day 11 Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా బాక్సాఫీస్ ముందు క్రమక్రమంగా ఢీలా పడిపోతూ వస్తోంది. సినిమా రిలీజైన తొలి వారంలో జోరుగా సాగిన కలెక్షన్స్.. ఇప్పుడు కాస్త నెమ్మదించాయి. సోషల్ మీడియాలో కాంట్రవర్సీలతో పాటు ప్రేక్షకులు ఇస్తున్న నెగిటివ్ టాక్ వల్ల ఈ సినిమా అటు స్టోరీ పరంగానూ ఇటు కలెక్షన్ల పరంగానూ ఎన్నో విమర్శలను అందుకుంటోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ మొత్తం కలిపి రూ.240 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.
Adipurush Box Office Collections : 'ఆదిపురుష్' మూవీకి 11వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ.5 లక్షలు, సీడెడ్‌లో రూ.12 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.4 లక్షలు, గుంటూరులో రూ.2 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 74 లక్షలు షేర్, రూ.1.15 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయిందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇక ప్రపంచవ్యాప్త గణాంకాలను చూసుకుంటే.. తెలుగులో రూ. 79.87 కోట్లు, తమిళంలో రూ. 2.41 కోట్లు, కర్నాటకలో రూ. 12.24 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 69.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.50 కోట్ల షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో రూ. 188.94 కోట్లు షేర్, రూ. 451 కోట్లు గ్రాస్ వచ్చింది.
Adipurush Cast : ఓం రౌత్ రూపొందించిన 'ఆదిపురుష్'ను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ప్రభాస్ రాఘవుడిగా కనిపించగా.. జానకిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్ నాగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ వెండితెరపై కనిపించారు. అజయ్, అతుల్ ద్వయం ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. 'ఆదిపురుష్'. ఇటీవలే సినిమాలోని శివోహం సాంగ్ ఫుల్ వెర్షన్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక ఈ మూవీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తే.. ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 11 రోజుల్లో దీనికి రూ. 188.94 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా ఇంకా రూ. 53.06 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాల టాక్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">