ETV Bharat / entertainment

దీనస్థితిలో నటి పావలా శ్యామల.. ఆదుకోవాలంటూ మరోసారి ఆవేదన - నటి పావల శ్యామల సినిమాలు

తన హాస్య నటనతో ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం చాలా కాలంగా దయనీయ జీవితం గుడుపుతోంది. అయితే తాజాగా మరోసారి తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది.

Pavala shyamala
దీనస్థితిలో నటి పావలా శ్యామల.. ఆదుకోవాలంటూ ఆవేదన
author img

By

Published : Nov 3, 2022, 10:06 AM IST

పావలా శ్యామల... ఈ పేరు తలుచుకోగానే ఆమె విలక్షణమైన హాస్య నటన గుర్తుకు వచ్చి అందరి పెదాలపై నవ్వులు పూస్తాయి. తెలుగులో 300కు పైగా సినిమాల్లో నటించి అందరికీ నవ్వులు పంచిపెట్టిన ఆమె మాత్రం చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. ప్రస్తుతం అనాథాశ్రమంలో కూతురితో కలిసి జీవిస్తోంది. ఆరోగ్యం సహకరించకపోవడం, అదే సమయంలో ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన దయనీయ పరిస్థితి గురించి చెప్పుకుని మరోసారి ఆవేదన వ్యక్తం చేసింది.

ఎప్పటి నుంచో తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, తనను తన కూతురిని చూసుకోవడానికి ఎవరూ లేరని చెబుతూ బాధపడింది. ఆ మధ్య మా అసోసియేషన్​లో మెంబర్ షిప్ లేకపోతే మెగాస్టార్​ చిరంజీవి లక్ష రూపాయలు కట్టి మరీ మెంబర్ షిప్ ఇప్పించారని గుర్తుచేసుకున్నారు. తన కుమార్తె వైద్య ఖర్చుల కోసం మరో 2 లక్షలు ఇచ్చి ఆర్థిక సాయం కూడా చేశారని వెల్లడించింది. అయితే మా నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని చెప్పుకొచ్చింది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక తనను చూసుకునేందుకు ఒక అమ్మాయిని పెట్టారని, అయితే ఆమె మధ్యలోనే సంబంధం లేదని వదిలేసి వెళ్లిపోయిందని, ఆ తర్వాత తాను బతికున్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదని ఏడ్చేసింది. ఇప్పుడు తన పరిస్థితి అస్సలు బాలేదని, ఓల్డేజ్ హోమ్​లో బతుకునీడుస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు సాయం చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'చిరు చెప్పిన ఒక్క డైలాగ్​తో మా సినిమాకు సూపర్ జోష్!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.