ETV Bharat / entertainment

Tollywood: ఈ డబ్బింగ్​ మూవీస్​ సూపర్ హిట్​​.. మీకు ఏది నచ్చింది? - 2022లో తెలుగు డబ్బింగ్‌ సినిమాలు

2022లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎన్నో డబ్బింగ్‌ సినిమాలు రాగా వాటిల్లో కొన్ని మాత్రమే మెప్పించాయి. అవేంటంటే..

ciniema
డబ్బింగ్‌
author img

By

Published : Dec 20, 2022, 2:51 PM IST

'కంటెంట్‌ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఏ భాషలో తెరకెక్కిన చిత్రాన్నైనా ఆదరిస్తారు' అనేది తెలిసిన విషయమే. అందుకే ఇతర చిత్ర పరిశ్రమల్లో రూపొందిన పలు సినిమాలు తెలుగులో ఎక్కువగా డబ్‌ అవుతుంటాయి. కొన్ని పాన్‌ ఇండియా ట్యాగ్‌తో అక్కడ విడుదలైన రోజే ఇక్కడా రిలీజ్‌కాగా కొన్ని ఆలస్యంగా వస్తుంటాయి. అలా ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయాన్ని అందుకున్న డబ్బింగ్‌ సినిమాల జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం..

బాక్సాఫీస్ బద్దలు.. యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన 'కేజీయఫ్‌ చాప్టర్‌ 2' వేసవిలో విడుదలై, బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన డబ్బింగ్‌ చిత్రంగా నిలిచింది. కన్నడ పరిశ్రమలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం కథ, హీరో- విలన్‌ ఎలివేషన్స్‌, నేపథ్య సంగీతం.. ఇలా ప్రతి అంశంలోనూ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సినిమా తొలిభాగం 'కేజీయఫ్‌ చాప్టర్‌ 1' 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ చిత్రాలు తెరకెక్కాయి.

dubbing movie
డబ్బింగ్‌ సినిమా

సినిమాటిక్‌ యూనివర్స్‌ సూపర్​.. 'విక్రమ్‌'తో సినిమాటిక్‌ యూనివర్స్‌ను పరిచయం చేశారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. కొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెట్టడమే ఆ యూనివర్స్‌ కాన్సెప్ట్‌. కమల్‌ హాసన్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన 'విక్రమ్‌'లో.. 'ఏజెంట్‌ విక్రమ్‌' (కమల్‌ హాసన్‌ పాత చిత్రం), 'ఖైదీ' (కార్తి సినిమా) సినిమాల్లోని పాత్రలు కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. కమల్ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ల కాంబినేషన్‌ మెప్పించింది. ఇందులోని సూర్య, కార్తి అతిథి పాత్రలు తదుపరి ఈ యూనివర్స్‌లో రానున్న సినిమాలపై ఆసక్తిని రేకెత్తించాయి. గ్యాంగ్‌స్టర్‌, అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ల మధ్య జరిగే పోరు ఇది.

dubbing movie
డబ్బింగ్‌ సినిమా

సంచలనం.. కొన్ని సినిమాలు మౌత్‌టాక్‌తోనే దూసుకెళ్తాయి. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన పెద్ద సినిమాలకు మించిన విజయాన్ని అందుకుంటాయి. అలాంటి చిత్రమే 'కాంతార'. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రమిది. కన్నడనాట మంచి టాక్‌ సొంతం చేసుకున్న కొన్నిరోజులకు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఆదరణ దక్కించుకుంది. 'వరాహ రూపం' గీతం ప్రత్యేకంగా నిలిచింది. ప్రకృతి - మానవాళి మధ్య సత్సంబంధాలు ఉండాలని తెలియజేస్తూ కర్ణాటక-కేరళలోని తుళునాడు సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో సాగే కథ ఇది.

dubbing movie
డబ్బింగ్‌ సినిమా

యూత్​​కు ఫుల్ కనెక్ట్​.. ప్రదీప్‌ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం 'లవ్‌ టుడే'. కోలీవుడ్‌లో ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు. దీనికి తెలుగు ప్రేక్షకులూ మంచి విజయాన్ని అందించారు. పెళ్లి చేసుకోవాలనుకునే ఇద్దరు ప్రేమికులు ఓ రోజంతా ఒకరి ఫోన్‌ని మరొకరు మార్చుకోవాల్సి వస్తే ఏమవుతుంది? అన్న అంశంతో ఈ చిత్రం రూపొందింది. ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా బాగా కనెక్ట్‌ అయింది.

dubbing movie
డబ్బింగ్‌ సినిమా

సర్దార్‌ సూర్​ .... మాయమైన సైనిక రహస్యాల ఫైల్‌ను వెతికి పట్టుకునేందుకు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ముందుకొస్తాడు. ఆ క్రమంలో తన తండ్రిపై దేశద్రోహి అనే ముద్ర పడిందని తెలుసుకుని షాక్‌ అవుతాడు. మరి, ఆ తండ్రి చేపట్టిన మిషన్‌ ఏంటి? ఎవరు ఆయన్ను దేశద్రోహిగా చిత్రీకరించారు? కొడుకైన పోలీస్‌ అధికారి తన తండ్రిపై ఉన్న మచ్చను పోగొట్టాడా? అనే ఆసక్తికర అంశాలతో రూపొందిన తమిళ చిత్రం 'సర్దార్‌'. కార్తి హీరోగా దర్శకుడు పి. ఎస్‌. మిత్రన్‌ తెరకెక్కించారు. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ ఈ స్పై థ్రిల్లర్‌కు చక్కని ఆదరణ దక్కింది.

dubbing movie
డబ్బింగ్‌ సినిమా

మరి కొన్ని చిత్రాలు.. విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌ తదితరుల భారీ తారాగణంతో తెరకెక్కిన తమిళ సినిమా 'పొన్నియిన్‌ సెల్వన్‌', రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌లు జంటగా నటించిన హిందీ చిత్రం 'బ్రహ్మాస్త్ర', వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌', ఇటీవల విడుదలైన హాలీవుడ్‌ మూవీ 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సుదీప్‌ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం 'విక్రాంత్‌ రోణ', శివ కార్తికేయన్‌ 'డాన్‌'(తమిళం) ఫర్వాలేదనిపించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.