రామ్‌పుర్...! సార్వత్రిక ఎన్నికల సమయంలో తరచూ వినిపిస్తున్న నియోజకవర్గం పేరు. ఇందుకు కారణం... అక్కడ సినీ నటి జయప్రద పోటీకి నిలవడమే. 2014లో భాజపా అభ్యర్థిపై ఓడిపోయిన ఆమె ఈసారి అదే పార్టీ తరఫున బరిలోకి దిగారు.
సమాజ్‌వాదీ పార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జయప్రద ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రామ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎస్పీ తరఫున బరిలో ఉన్నది ఆజంఖాన్ కావటం విశేషం.
సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న రోజుల్లో ఆజంఖాన్‌ను సోదరుడిగా భావించేవారు జయప్రద. ఆ తర్వాత ఎన్నో వివాదాలు. చివరకు... వారిద్దరూ ప్రత్యర్థుల్లా నేరుగా పోటీపడే పరిస్థితి వచ్చింది.
రామ్‌పుర్‌లో విజయావకాశాలపై జయప్రదతో ఈటీవీ భారత్ ప్రతినిధి ఆజంఖాన్ ముఖాముఖి మీకోసం...
లోక్‌సభ ఎన్నికలకు మూడో సారి పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఎన్నికలకు వెళ్తున్నారు? ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?
ప్రజలు సంతోషంగా ఉన్నారు. గెలవాలని ఆశిస్తున్నారు. గ్రామాల్లో ఉండే ప్రజల ఉత్సాహాన్ని మాటల్లో చెప్పలేం. ప్రజలు చూపిస్తున్న ప్రేమ నాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఎక్కడికి వెళ్లినా వేల మంది వస్తున్నారు. ప్రచారానికి ప్రజలను వాహనాల్లో తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మహిళలు వాళ్లంతట వాళ్లే వచ్చి రాత్రి వరకు ఉంటున్నారు.
మీరు రామ్‌పుర్ నియోజకవర్గంలోనే ఉంటున్నారు. గతంలో మీరు చేపట్టిన పనులు చరిత్రలో ఎవరూ చేసి ఉండరని చెప్పుకోవచ్చు. ఈసారి ఏఏ పనులు చేయనున్నారు?
నేను చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడ విడిచిపెట్టానో అక్కడే ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది. ఈ విషయంలో ప్రజల మద్దతు తీసుకోవాల్సి ఉంది. వీటి తరువాత ఎలాంటి పనులు చేపట్టాలన్నది ఆలోచించాల్సి ఉంది. ఇంతకుముందు ప్రగతికి దూరంగా ఉన్న ప్రజలు ఇప్పుడు మరింత అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభించారు. అదే తరహాలో పనిచేసే ఒక కార్యకర్తను నేను. రాష్ట్రంలో, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉండటం వల్ల ఈ ప్రాంతానికి నిధుల విషయంలో ఎలాంటి ఆటంకం ఉండదు కాబట్టే భాజపాలో చేరాను.
ప్రస్తుత ఎన్నికల్లో మీ పోటీ సోదరుడితోనా? కాంగ్రెస్‌తోనా?
ఎన్నికలు ఎన్నికలే. మా ప్రత్యర్థులెవరినీ తక్కువ అంచనా వేయటం లేదు. పూర్తి సామర్థ్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తాం.
ఇవీ చూడండి: