ETV Bharat / crime

చంచల్‌గూడ జైలుకు వివేకా హత్య కేసు నిందితులు - Viveka murder case investigated in the CBI court

YS Vivekananda Reddy murder case update: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గరు నిందితులను చంచల్​గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ2 సునీల్‌ యాదవ్‌, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్‌లను కడప జైలు నుంచి పోలీసు వాహనాల్లో హైదరాబాద్‌ తీసుకొచ్చి నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మొదట హాజరుపరిచారు.

Viveka murder case Accused
Viveka murder case Accused
author img

By

Published : Feb 10, 2023, 9:49 PM IST

YS Vivekananda Reddy murder case update: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఐదుగురు నిందితులను అధికారులు హాజరుపర్చారు. ఏ2 సునీల్‌ యాదవ్‌, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్‌లను కడప జైలు నుంచి వాహనాల్లో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. బెయిల్‌పై ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డితో పాటు సీబీఐకి అప్రూవర్‌గా మారిన ఏ4 దస్తగిరి కోర్టుకు వచ్చారు.

ఐదుగురిని న్యాయస్థానం విచారించింది. ఆ తర్వాత రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ మార్చి 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి కడప కోర్టులో ఈనెల 16న కేసు ఉందని ఆయన తరఫు న్యాయవాది సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చారు. అనుమతి కోసం పిటిషన్‌ వేయాలని న్యాయమూర్తి సూచించారు. ముగ్గురు నిందితులను పోలీసు భద్రత మధ్య చంచల్‌ గూడ జైలుకు తరలించారు.

వివేకా హత్యకేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత తొలిసారి ఐదుగురు నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులు కడప జైలులో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ చేపట్టినందున ముగ్గురినీ చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.