చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని బంధువులు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ చనిపోయింది. పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన యువతి గాయత్రి (20) మంగళవారం తమ బంధువుల అమ్మాయితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తోంది. పోతనపెట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీబాబు ఆమెను దారిలో అటకాయించి కత్తితో తీవ్రంగా గాయపరిచాడు.
పొట్టభాగంలో తీవ్ర గాయాలైన యువతిని బంధువులు హుటాహుటిన పెనుమూరు పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తీసుకెళ్తుండగా గాయత్రి మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడని స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: గ్యాస్ లీకై ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం