రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని సులేమాన్ నగర్లో.. రహదారిపై ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా.. అటుగా వస్తోన్న ఓ బైక్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన వాహనదారుడు.. తన సోదరుడితో కలిసి పోలీసులపై విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగక.. వారిపై రాళ్ల దాడికి యత్నించాడు.
మాస్క్, హెల్మెట్ లేకుండా..
లాక్డౌన్ సమయంలో ఇమాద్ నగర్ బస్తీలో పోలీసులు గస్తీ కాస్తూ ఉండగా.. కనీసం హెల్మెట్, మాస్క్ కూడా లేకుండా అటుగా వచ్చిన ఓ యువకుడి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన వాహనదారుడి సోదరుడు.. ఎదురు తిరగడమే కాకుండా వారిపై దురుసుగా ప్రవర్తించాడు. మా గల్లీకి వచ్చీ.. మమ్మల్నే ఆపుతారా అంటూ భూతులు తిట్టారు.
ఎవ్వరినీ వదిలిపెట్టం..
దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కష్టకాలంలో అహర్నిశలు శ్రమిస్తోన్న పోలీసులపై.. పోకిరీలు ఇలా దాడులకు పాల్పడటం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: బైక్‌పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్