సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన వినయ్(22).. కంటాత్మకూర్ వాగు వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్లలో పడ్డాడు. తలకు తీవ్ర గాయాలై నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
అందరూ కలిసి షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వినయ్ కుటుంబసభ్యులు తెలిపారు. అంతసేపు తమతో సరదాగా గడిపిన కుమారుడు మృతి చెందడంతో.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వినయ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: చోరీలు, అత్యాచారాలకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్: సీపీ