ETV Bharat / crime

'పోలీసులు చేరదీసినా.. కరోనా బలితీసుకుంది' - telangana news

అప్పటిదాకా వారితో సందడిగా గడిపిన ఆమె తెల్లవారే సరికి కన్నుమూసింది. రోడ్డుపై గాయాలతో సంచరిస్తున్న అభాగ్యురాలిని చేరదీసి.. వైద్యం చేసినా.. కరోనా మహమ్మారి కాటుకు ఆమె బలైపోవడం వల్ల ఇటు వైద్యబృందం.. అటు తోటి రోగులు మనోవేదనకు గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

corona death, corona death in Hyderabad, corona death, కరోనా వార్తలు, కరోనా వ్యాప్తి, హైదరాబాద్​లో కరోనా వ్యాప్తి
corona death, కరోనా వార్తలు, కరోనా వ్యాప్తి, హైదరాబాద్​లో కరోనా వ్యాప్తి
author img

By

Published : Apr 30, 2021, 10:50 AM IST

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్​లో రోడ్డుపై గాయాలతో సంచరిస్తున్న యువతి(25)ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు ఈనెల 12న ఆ యువతిని కింగ్​కోఠిలోని హైదరాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒళ్లంతా వికారంగా ఉండటం వల్ల ఆమెకు వైద్యం చేయడానికి సిబ్బంది వెనుకడుగేశారు. అడిషనల్ సూపరింటెండెంట్ జలజ వెరోనికా ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించారు.

రెండ్రోజుల క్రితం యువతికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించగా.. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆమెకు చికిత్స కూడా అందించారు. అయినా యువతి మృతి చెందడం.. ఇటు వైద్యులను.. అటు తోటి రోగులను తీవ్రంగా బాధించింది. యువతి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఎల్బీనగర్ పోలీసులకు నారాయణగూడ పోలీసులు సమాచారం అందించారు. సుమారు 3 గంటలైనా వారు రాకపోవడం వల్ల మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.