ETV Bharat / crime

Woman's Suspicious Death : తల్లి చనిపోయిందని తెలియక.. 4 రోజులుగా స్కూలుకెళ్లొస్తూ.. - Woman's Suspicious Death in Chittoor

Woman's Suspicious Death in Chittoor : రోజు ఉదయాన్నే నిద్రలేచే తన తల్లి.. నాలుగు రోజులుగా అలాగే నిద్రిస్తున్నా.. ఏమైందో ఆ బాలుడికి అర్థంకాలేదు. అమ్మ నిద్రిస్తుందనుకుని భావించి.. తానే రోజు స్కూలుకు వెళ్లివస్తున్నాడు. ఇంట్లో ఉన్న తినుబండారాలతో నాలుగు రోజులు గడిపాడు. తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలియక.. ఆమె పక్కనే నిద్రిస్తున్నాడు. అయితే.. ఇంట్లో ఏదో కుళ్లిపోయిన వాసన వస్తోందని.. బాలుడు మేనమామకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూసేసరికి.. అసలు విషయం తెలిసింది. ఈ విషాదకర ఘటన.. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Woman's Suspicious Death
Woman's Suspicious Death
author img

By

Published : Mar 12, 2022, 9:37 AM IST

Woman's Suspicious Death in Chittoor : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం విద్యా నగర్ కాలనీలో.. ఓ మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ రాజ్యలక్ష్మి.. కుటుంబకలబహాలతో భర్త శ్రీధర్​కు దూరంగా తిరుపతిలో కుమారుడితో కలిసి ఉంటుంది. ఆమె కుమారుడు శ్యామ్ కిశోర్(10) స్థానికంగా ఉన్న పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 8న రాజ్యలక్ష్మి మంచం నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే అమ్మ నిద్రపోతోందని భావించిన శ్యామ్ కిశోర్.. రోజూ స్కూలుకు వెళ్లి వస్తున్నాడు. రోజు అమ్మ పక్కనే పడుకుంటున్నాడు.

Woman's Suspicious Death
మృతురాలు రాజ్యలక్ష్మి
Woman's Suspicious Death
శ్యామ్ కిశోర్

శుక్రవారం శ్యామ్ కిశోర్ తన మేనమామ దుర్గాప్రసాద్​కు ఫోన్ చేసి ఇంట్లో వాసన వస్తోందని చెప్పాడు. దీంతో దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి చూడగా.. అసలు విషయం బయటపడింది. రాజ్యలక్ష్మి మృతి చెంది నాలుగు రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయింది. దుర్గాప్రసాద్ వెంటనే ఎంఆర్​పల్లి పోలీసులు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. రాజ్యలక్ష్మి కుమారుడు శ్యామ్ కిశోర్​కు మానసిక స్థితి సరిగా లేదని.. దుర్గాప్రసాద్ తెలిపారు. దుర్గాప్రసాద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.