ETV Bharat / crime

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

నల్గొండ జిల్లా శాలిగౌరారంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. బైరవునిబండ గ్రామానికి చెందిన సుజాత మనస్తాపంతో ఈనెల 8న ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను... వెంటనే చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

woman died while undergoing treatment at Shaligauraram in Nalgonda district
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
author img

By

Published : Mar 13, 2021, 10:26 PM IST

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరవునిబండ గ్రామానికి చెందిన శివరాత్రి సుజాత(40)... కొంతకాలం కిందట ఆమె భర్త మృతి చెందాడు. దీంతో ఉన్న ఇల్లును అమ్మి తన కూతురు వివాహం చేయాలని నిర్ణయించుకుంది. అదే గ్రామానికి చెందిన కోనేటి వీరయ్య అనే వ్యక్తి రూ. 6 లక్షల 50 వేలకు సుజాత ఇల్లును కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. మూడు నెలల కిందట పెద్దమనుషుల సమక్షంలో ధర నిర్ణయించి, ముందస్తుగా కొంత నగదు చెల్లించాడు.

ఆ తరువాత మిగిలిన డబ్బులను వీరయ్య చెల్లించకపోవటంతో మనస్తాపానికి గురైన సుజాత... ఈ నెల 8న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందిస్తోన్న ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.