ETV Bharat / crime

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి - తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం తాజా అప్ డేట్స్

డ్రైవర్​ నిద్రమత్తు, అతి వేగంతో తిరుపతి కర్నాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా..మరొకరు గాయపడ్డారు.

woman-dead-in-rtc-bus-accident-at-karnal-street-in-tirupati-chittoor-district
తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి
author img

By

Published : Apr 25, 2021, 8:41 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి కర్నాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది.. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

తిరుపతి రైల్వేస్టేషన్​ నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. రెండు విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్​ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి... ఆక్సిజన్​ సిలిండర్‌ లేదని నెబ్యులైజర్‌ వాడుతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.