Wife Killed Husband with Lover: ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడు దస్తగిరితో కలిసి భార్య హత్య చేసింది. 5రోజుల క్రితం సుధాకర్ అదృశ్యం అవ్వగా... అతడి తండ్రి స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. భార్య లక్ష్మి, ఆమె ప్రియుడిని ప్రశ్నించారు. సుధాకర్‌ను తామే హత్య చేసి హంద్రీ నదిలో పాతిపెట్టామని నిందితులు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:అక్షింతలు వేస్తానని... రాడ్డుతో తలపై కొట్టి చంపిన అర్చకుడు