ETV Bharat / crime

మైనర్ బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం, రక్తస్రావం కావడంతో - minor girl rape news

Ward member rapes minor girl in Nizamabad నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వార్డు మెంబర్​ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు.

Ward member rapes minor girl in Nizamabad

author img

By

Published : Aug 29, 2022, 1:57 PM IST

Ward member rapes minor girl in Nizamabad : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 28న జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్ష రాసేందుకు బాధితురాలి తల్లి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వార్డు మెంబర్ ఆమె తొమ్మిదేళ్ల పెద్ద కుమార్తెను పట్టణంలోని ఓ అద్దె నివాసానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. సిబ్బందికి తల్లి ఫోన్ నెంబర్​ను అందజేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆర్మూర్ పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.