ETV Bharat / crime

భార్యపై అత్యాచారయత్నం.. అడ్డుకున్న భర్త వేలిని కొరికి..! - అడ్డుకున్న భర్త

భార్యపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న భర్తపై దాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండాపూర్​లో చోటు చేసుకుంది.

VRA attack on women husband
బాధితుడు శ్రీనివాస్
author img

By

Published : Mar 18, 2022, 4:06 PM IST

అత్యాచారాన్ని అడ్డుకున్న భర్తపైనే దాడికి తెగబడ్డాడు ఓ కామాంధుడు. భార్యపై జరుగుతున్న దారుణాన్ని ఆపేందుకు యత్నించిన భర్త వేలి కొరికి పరారయ్యాడు. ఈ దాడిలో అతని వేలు పూర్తిగా తెగిపడింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్​లో ఈ సంఘటన జరిగింది.

వీఆర్​ఏ వీరంగం..

కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామశివారులో బిర్యానీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామంలో వీఆర్​ఏగా పనిచేస్తున్న అశోక్ హోటల్​కు వెళ్లి శ్రీనివాస్ భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు విన్న భర్త శ్రీనివాస్ అశోక్​ను అడ్డుకునే క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అదే క్రమంలో శ్రీనివాస్ చేతివేలు తెగిపడేలా కొరికి అశోక్ పరారయ్యాడు. బాధితుడు తీవ్ర రక్తస్రావంతో రాయపర్తి పోలీసులను ఆశ్రయించాడు. వీఆర్​ఏపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

కొండాపూర్​ గ్రామ శివారులో బిర్యానీ హోటల్ నడుపుతున్నా. నిన్న రాత్రి 9 గంటల సమయంలో అశోక్ అనే వ్యక్తి మా హోటల్​కు వచ్చి నా భార్యను పొలాల్లోకి లాక్కొనిపోవడం జరిగింది. మద్యం మత్తులో నా భార్యపై అసభ్యంగా ప్రవర్తించాడు. నేను అతని గళ్ల పట్టుకోగా నా వేలిని పూర్తిగా కొరికేశాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు అతన్ని జైల్లో పెట్టాలి. - శ్రీనివాస్, బాధితుడు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.