Drinking Hookah and Playing Poker: కామారెడ్డి జిల్లాలో కొందరు యువకులు నిషేధిత హుక్కా తాగుతూ... పేకాట ఆడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. లింగంపేట్ మండలం మెంగారం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతూ వీడియోలో కనిపించారు.
ఈ వీడియోలో మెంగారం గ్రామ సర్పంచ్ మహేశ్ ఉండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతను పేకాట ఆడేందుకు ప్రోత్సహిస్తున్నాడని... పిల్లల భవిష్యత్ నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: Realtors Arrested for Playing Poker : పేకాట ఆడిన 12 మంది స్థిరాస్తి వ్యాపారులు అరెస్టు