రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధి గోల్డెన్హైట్స్లో ఓ యువతి అనుమానాస్పత స్థితిలో మృతి చెందింది. జన చైతన్య వెంచర్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి గుర్తుతెలియని యువతి మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కింద పడిందా... లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ కనకయ్య తెలిపారు.
ఇదీ చూడండి: ఈత రాకున్నా బావిలోకి దిగి మృతి