Road accident in nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కారు బోల్తా పడింది. అధిక వేగంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఘటన సమయంలో ముగ్గురు యువకులు కారులో ఉన్నారు. ఆర్మూర్ కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో రాము అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. తీవ్రగాయాలైన ఇద్దరిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో జ్ఞానేశ్ గౌడ్ మృతి చెందాడు. మరో యువకుడు చరణ్ గౌడ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం... ఇద్దరికి తీవ్రగాయాలు