ETV Bharat / crime

Road accident in Kompally: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - తెలంగాణ తాజా నేర వార్తలు

road accident kompally: తెల్లవారుజామున మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

road accident
ప్రమాదంలో తుక్కతుకైన కారు
author img

By

Published : Feb 8, 2022, 11:09 AM IST

road accident kompally: మేడ్చల్ జిల్లా కొంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున తుప్రాన్ నుంచి గుడిమల్కాపూర్ పూల మార్కెట్​కు వెళ్తున్న కారు కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తుక్కుతుక్కు కావడంతో కారు నడుపుతున్న షకీర్(30), పక్కన్న ఉన్న అఫ్సర్(55) అక్కడికక్కడే మృతి చెందారు. బాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Petrol Tanker Blast at Suryapet: బస్టాండ్‌ వద్ద పేలిన పెట్రోల్‌ ట్యాంకర్‌​.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.