రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం వ్యాను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమంతరావు, రామచంద్రయ్యలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.
ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి