ETV Bharat / crime

kurnool murders: మారణాయుధాలతో దాడి చేసి... ఆపై పెట్రోల్ పోసి..

author img

By

Published : Jan 28, 2022, 5:17 AM IST

KURNOOL MURDERS : సామాజిక మాధ్యమాల వేదికగా రెండు వర్గాల మధ్య నెలకొన్నభూ వివాదం చిలికి చిలికి గాలివానైంది. వివాదంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల ప్రాణాలను బలికొంది. పట్టపగలే మారణాయుధాలతో దాడి చేయటమే కాకుండా... పెట్రోలు పోసి నిప్పంటించి కిరాతకంగా హతమార్చిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

kurnool murders: మారణాయుధాలతో దాడి చేసి... ఆపై పెట్రోల్ పోసి..
kurnool murders: మారణాయుధాలతో దాడి చేసి... ఆపై పెట్రోల్ పోసి..
kurnool murders: మారణాయుధాలతో దాడి చేసి... ఆపై పెట్రోల్ పోసి..

KURNOOL MURDERS : ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంకు చెందిన బోయ మునీంద్రయ్యకు 7 ఎకరాల పొలం ఉంది. అదే పొలానికి ఆనుకుని ఉన్న పోరంబోకు భూమిని వడ్డె మల్లికార్జున సాగు చేసుకుంటున్నారు. మునీంద్రయ్య తన పొలాన్ని అమ్మకానికి పెట్టగా.. దాన్ని కొనుగోలు చేసేందుకు మల్లికార్జున ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కొంత నగదు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పూర్తి నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే సాగు చేసేందుకు మల్లికార్జున కుటుంబం ఆ భూమిలోకి వెళ్లింది. అందుకు మునీంద్రయ్య అభ్యంతరం తెలపడంతో ఇరువురి మధ్య పొలం వివాదం కోర్టుకు చేరింది. మునీంద్రయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చినా మల్లికార్జున ఆ పొలాన్ని వీడలేదు. మునీంద్రయ్య... స్థానిక వైకాపా నాయకుడు మహేంద్రరెడ్డిని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న మల్లికార్జున భాజపా నాయకులతో మీడియా సమావేశం పెట్టించారు. భూ కబ్జాదారుడు పేరుతో వైకాపా నాయకుడిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టారు. అంతలోనే వైకాపా నాయకుడిది తప్పులేదని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేశాయి. తనపై ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని రావాలంటూ వైకాపా నాయకుడు మహీంద్రారెడ్డి కొంతమందిని మల్లికార్జున ఇంటికి పంపించారు.

ఆయుధాలతో దాడి చేసి... ఆపై పెట్రోలు పోసి..

మల్లికార్జున ఇంటి వద్దకు సర్పంచ్ సోదరుడు శివప్పతో పాటు 30మంది వచ్చారు. అప్పటికే ప్రణాళికతో సిద్ధంగా ఉన్న మల్లికార్జున, రాజు, రామాంజి, ఈశ్వర్, గోపాల్, చంద్రతో పాటు మరికొందరు మహిళలు రాళ్లు, కారంతో ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. ప్రతిఘటించబోయిన వారిపై పొలానికి మందు పిచికారీ చేసే యంత్రంలో యాసిడ్ కలిపి స్ప్రేచేయటంతో వచ్చినవారంతా పరుగులుపెట్టారు. ఈ క్రమంలో శివప్ప, భాస్కర్ అలియాస్ గట్టు ఈరన్నలను వేటకొడవళ్లు, గొడ్డలి, ఉలి వంటి పదునైన ఆయుధాలతో దాడి చేసి... ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు. శివప్ప ఘటనా స్థలంలోనే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న ఈరన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపు మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘర్షణలో సత్యప్ప, బజారప్ప, అయ్యప్ప, పెద్దతిమోతి, ఇస్మాయిల్‌కు గాయాలవ్వగా... ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో బజారప్ప, సత్యప్పల పరిస్థితి విషమంగా ఉండటంతో... కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు.

వివాదానికి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు మృతి

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై అసలు విషయం ఏంటో తెలుసుకొని రమ్మని చెబితేనే వచ్చినట్లు తాము చెబుతున్నారు. అయితే ఊహించని విధంగా మల్లికార్జున బంధువులు చేసిన దాడిలో వివాదానికి ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారని చెబుతున్నారు.

పరారీలో నిందితులు

ఘటనా స్థలాన్ని కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలోని బాధితులతో మాట్లాడారు. దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారన్న ఆయన.. వారిపై కేసు నమోదు చేశామన్నారు. వారి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.