two groups attack : ఓ భూవివాదంలో తలెత్తిన గొడవ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. ఓ స్థల విషయంపై వివాదం రావడంతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఏకంగా కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్లలో ఈ ఘర్షణ జరిగింది.
ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రగాయాలైన బాధితులను బాల్కొండ నియోజకవర్గ భాజపా నాయకుడు యేలేటి మల్లికార్జునరెడ్డి పరామర్శించారు. బాధితులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్మూర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: బెంబేలెత్తిస్తున్న ప్లాస్టిక్ భూతం.. భారీగా పెరుగుతున్న వినియోగం
ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?